Matti Kusthi Collection: ‘మట్టి కుస్తీ’ రెండో రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది..!

కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మట్టి కుస్తీ. ‘ఆర్ టీ టీమ్ వర్క్స్’, ‘విష్ణు విశాల్ స్టూడియోస్’ బ్యానర్లపై మాస్ మహారాజ్ రవితేజతో కలిసి విష్ణు విశాల్,శుభ్రా,ఆర్యన్ రమేష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు.భార్యా భర్తల మధ్య అనుబంధం అలాగే రెజ్లింగ్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. డిసెంబర్ 2న ఈ మూవీ తమిళ్ తో పాటు మలయాళం, తెలుగు భాషల్లో కూడా ఏకకాలంలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. దీంతో తెలుగులో ఈ సినిమా పై ఓ మోస్తారు అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే నమోదయ్యాయి. రెండో రోజు కూడా ఈ మూవీ ఓకె అనిపించింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.18 cr
సీడెడ్ 0.11 cr
ఆంధ్ర 0.21 cr
ఏపీ +తెలంగాణ 0.50 cr

‘మట్టీ కుస్తీ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.1.9 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.0.50 కోట్ల షేర్ ను రాబట్టింది. హిట్ 2 సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో మట్టీ కుస్తీ పర్వాలేదు అనిపించేలా కలెక్ట్ చేస్తుంది. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా పెద్దదిగా ఉండటం వల్ల ఇంకా బాగా రాణించాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకో రూ.1.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus