2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

ఈ సమ్మర్ కూడా పెద్ద సినిమాలు (Tollywood ) లేకపోవడం వల్ల డల్లుగా సాగింది. జనాలు ఈ సమ్మర్ సినిమాలని పూర్తిగా లైట్ తీసుకున్నారు అనుకునేలోపు.. మే నెలలో కొన్ని సినిమాలు మెరుపులు మెరిపించాయి. ఈ నెలలో ‘హిట్ 3’ (HIT 3) (హిట్ : ది థర్డ్ కేస్) ‘రెట్రో’ (Retro) ‘బ్లైండ్ స్పాట్’ ‘కామన్ మెన్ పెళ్ళాం’ ‘సింగిల్’ (#Single) ‘శుభం’ (Subham) ‘కలియుగమ్ 2064’ (Kaliyugam 2064) ‘అనగనగా’ (Anaganaga)  (ఓటీటీ) ’23 ఇరవై మూడు’ ‘ఎలెవన్’ ‘త్రిగుణి’ ‘వీరరాజు 1991’ ‘ఒక బృందావనం’ ‘వైభవం’ ‘భైరవం’  (Bhairavam) ‘షష్టిపూర్తి’ ‘X రోడ్స్’ ‘ఘటికాచలం’ వంటి వాటితో పాటు..

Tollywood

మరో చిన్న చితక సినిమాలు కలుపుకుని మొత్తంగా 40 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. ఇందులో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. నాని (Nani) హీరోగా తెరకెక్కిన ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. వీకెండ్ కు భారీ నంబర్స్ పెట్టింది. ఆ తర్వాత వర్షాల వల్ల కొంచెం స్లో అయ్యింది. అయినప్పటికీ ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి ‘హిట్’ సినిమా అనిపించుకుంది.

‘రెట్రో’ .. ఓ మోస్తరు ఓపెనింగ్స్ సాధించింది. కానీ తర్వాత నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల .. డౌన్ అయిపోయింది. తర్వాత వచ్చిన శ్రీవిష్ణు (Sree Vishnu) ‘సింగిల్’ బాగానే కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. సమంత నిర్మాణంలో వచ్చిన ‘శుభం’ కూడా బాగానే కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది.

అటు తర్వాత ‘భైరవం’ ఓ మోస్తరు ఓపెనింగ్స్ సాధించింది. రీ- రిలీజ్ అయిన ‘ఖలేజా’ (Khaleja) సైతం భారీ వసూళ్లు సాధించింది. ఇలా 40 సినిమాలు రిలీజ్ అయితే కేవలం 4 హిట్లు(1 రీ రిలీజ్ తో కలుపుకుని).. 1 యావరేజ్(భైరవం) మాత్రమే కొద్దో గొప్పో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. (Tollywood  ) మిగిలినవన్నీ చేతులెత్తేశాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags