సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో ‘మజాకా’ (Mazaka) సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ‘మన్మధుడు’ బ్యూటీ అన్షు (Anshu Ambani) (Anshu Ambani) రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. టీజర్, ట్రైలర్స్ ఆసక్తి పెంచాయి.
దీంతో ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. ఇక లేట్ చేయకుండా ‘మజాకా’ చిత్రానికి ఎంత బిజినెస్ జరిగింది? దీని బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత? అనే వివరాలు ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.50 cr |
సీడెడ్ | 1.80 cr |
ఆంధ్ర(టోటల్) | 4.00 cr |
ఏపీ+తెలంగాణా(టోటల్) | 9.30 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.70 cr |
ఓవర్సీస్ | 0.50 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 10.50 cr |
‘మజాకా’ చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ తో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.