‘ధమాకా’ తో (Dhamaka) రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడు త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటించిన సినిమా ‘మజాకా'(Mazaka). రావు రమేష్ (Rao Ramesh) కీలక పాత్రలో నటించిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యింది.రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో సో సో ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే నెగిటివ్ టాక్ వల్ల.. వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా తగ్గాయి.
ఆ తర్వాత కోలుకుంది లేదు. పైగా ‘సీతమ్మ వాకిట్లో..'(రీ- రిలీజ్), ఛావా(తెలుగు వెర్షన్) వంటి సినిమాలు పోటీగా రిలీజ్ అవ్వడం వల్ల… కోలుకునే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.85 cr |
సీడెడ్ | 0.73 cr |
ఉత్తరాంధ్ర | 0.78 cr |
ఈస్ట్ | 0.25 cr |
వెస్ట్ | 0.19 cr |
గుంటూరు | 0.45 cr |
కృష్ణా | 0.41 cr |
నెల్లూరు | 0.18 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.84 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.90 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 5.74 cr |
‘మజాకా’ (Mazaka) చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.5.74 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.5.26 కోట్ల షేర్ దూరంలో ఆగిపోయింది. గ్రాస్ పరంగా రూ.10.80 కోట్లు రాబట్టింది.