మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ నాలుగురోజుల కలక్షన్స్

నేచురల్‌ స్టార్‌ నాని మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ గా నటించిన ‘ఎంసీఏ’ సినిమా అన్ని తరగతుల వారికి నచ్చేస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత గురువారం రిలీజ్ మంచి స్పందన అందుకుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున 7 కోట్ల షేర్ ను వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండు రోజుల్లో10 కోట్లకు పైనే షేర్ రాబట్టింది. నాని, సాయి పల్లవికి తోడు భూమిక ఈ సినిమా విజయంలో కీలకరోల్ పోషిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 22.27 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ (షేర్) .. కోట్లలో..

నైజాం : 7.51
సీడెడ్ : 2.59
ఉత్తరాంధ్ర : 2.31
గుంటూరు : 1.29
ఈస్ట్ : 1.30
వెస్ట్ : 1.02
కృష్ణ : 1.16
నెల్లూరు : 0.54
మొత్తం : 17.72
ఇతర రాష్ట్రాల్లో : 1.80
ఓవర్సీస్ : 2.75
ప్రపంచవ్యాప్తంగా : 22.27

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus