Meenakshi Chaudhary: మళ్లీ ఖండించిన మీనాక్షి.. రూమర్లు ఎలా వస్తాయంటూ ప్రశ్న!

సినిమా పరిశ్రమలో సినిమాలు తెరకెక్కడం ఎంత కామనో, వాటి గురించి.. అందులో నటించిన వారి గురించి రూమర్లు రావడం కూడా అంతే కామన్‌. ఎన్నో ఏళ్లుగా ఇలా జరుగుతూనే ఉంది. అయితే కొంతమంది వాటిపై రియాక్ట్‌ అవుతుంటారు. మరికొందరు వాటి గురించి తమ టీమ్‌తో క్లారిటీ ఇస్తుంటారు. ఇంకొందరైతే వాటిని పట్టించుకోరు. అలా స్టార్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి కూడా తనపై వస్తున్న ఆరోపణల విషయంలో పై మూడూ చేసింది. ఇప్పుడు క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా ఆ పుకార్లు ఆగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Meenakshi Chaudhary

ఇంతకీ ఏమైందంటే.. మీనాక్షి చౌదరి ఓ యంగ్‌ హీరో (ఇప్పుడు సినిమాలు చేయడం లేదు)తో ప్రేమలో పడింది అని, ప్రస్తుతం రిలేషన్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ పుకార్ల సారాంశం. నిజానికి ఈ పుకార్లు గత కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి. తొలుత వీటి విషయంలో పెద్దగా రియాక్ట్‌ కాని మీనాక్షి చౌదరి.. ఆ తర్వాత తన టీమ్‌ ద్వారా ‘అలాంటిదేం లేదు’ అనే క్లారిటీ ఇచ్చింది. అయినా నిప్పు లేనిదే పొగ రాదు అంటూ ఆ పుకార్లు ఇంకా షికారు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆమె కూడా స్పందించింది.

‘అనగనగా ఒక రాజు’ నవీన్‌ పొలిశెట్టితో కలసి ఈ సంక్రాంతికి అలరించడానికి సిద్ధమైంది నటి మీనాక్షి చౌదరి. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన మీనాక్షికి రెండు పుకార్ల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఒకటి ‘తల్లి పాత్రలు చేయడానికి మీరు సిద్ధంగా లేరట కద’ అని. రెండోది ‘మీరు రిలేషన్‌లో ఉన్నారట కదా.. పెళ్లి ఎప్పుడు?’ అని. ఈ రెండింటి గురించి పూర్తి క్లారిటీ మళ్లీ ఇచ్చింది మీనాక్షి.

‘లక్కీ భాస్కర్’ సినిమాలో మీనాక్షి ఓ బిడ్డకు తల్లిగా కనిపించింది. అయితే ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తుండటంతో ఇక అలాంటి క్యారెక్టర్‌లు చేయను అని చెప్పందని వార్తలొచ్చాయి. దీనిపై ఆమె రియాక్ట్‌ అవుతూ అసలు ఆ రూమర్స్‌ ఎలా సృష్టిస్తారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడా అలా అనలేదు. కథ, పాత్ర బాగుంటే ఎలాంటి పాత్రలోనైనా నటిస్తాను అని క్లారిటీ ఇచ్చేసింది. ఇక తాను పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న రూమర్స్‌ విని అలసిపోయాను. వాటిలో నిజం లేదు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు అని మీనాక్షి చెప్పేసింది.

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus