మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి వరుస హిట్లతో ఫామ్లో ఉండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.
ఈ సాంగ్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 49 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘మీసాల పిల్లా నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా’ అంటూ మొదలైన ఈ పాట.. ‘చిరుతకు చెమటలు పట్టేలా’… ‘నీ వేషాలు చాల్లే… నువ్ బాధపడితే కరిగేటంత సీనే లేదేలే’ అంటూ వచ్చే లిరిక్స్ మంచి హై ఇస్తాయి. లిరిక్స్ బాగున్నాయి. అన్నీ క్యాచీగా అనిపిస్తున్నాయి. భాస్కర్ భట్ల సిట్యుయేషన్ కి తగ్గట్టు ఈ లిరిక్స్ రాసి ఉండొచ్చు. సినిమాలో హీరో, హీరోయిన్.. ఎక్కువగా గొడవలు పడే భార్యాభర్తల్లా కనిపిస్తారని ఈ పాటలోని లిరిక్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్.. చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈ పాట పట్టినట్టు అర్థమవుతుంది. ఈ సాంగ్లో చిరు, నయన్ వేసే స్టెప్స్ చాలా సరదాగా అనిపిస్తున్నాయి. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తంగా మొదట్లో ‘మీసాల పిల్లా’ పాటపై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫుల్ సాంగ్ విన్నాక ఆ ఒపీనియన్స్ మారే అవకాశం కూడా లేకపోలేదు. మీరు కూడా ఒకసారి ఈ పాటను చూస్తూ వినండి :