Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Babu: నాగబాబు సాయానికి కన్నీళ్లు పెట్టుకున్న పాకీజా.. ఆమె ఏమన్నారంటే..

Naga Babu: నాగబాబు సాయానికి కన్నీళ్లు పెట్టుకున్న పాకీజా.. ఆమె ఏమన్నారంటే..

  • January 30, 2023 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Babu: నాగబాబు సాయానికి కన్నీళ్లు పెట్టుకున్న పాకీజా.. ఆమె ఏమన్నారంటే..

సినిమా పరిశ్రమలో ఒకప్పుడు మంచి స్టార్ స్టేటస్ అనుభవించి, ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్న సీనియర్ నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన దీన గాధలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరికి అవసరమైన సాయమందితే.. మరికొందరు ఇంకా సాయం చేసే వారికి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇటీవల నటి పాకీజా ప్రస్తుత పరిస్థితి గురించి వార్తలు వైరల్ అయ్యాయి.. తమిళనాడులోని కారైకుడికి చెందిన పాకీజా అసలు పేరు వాసుకి. పాకీజాగా తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె.

ప్రస్తుతం వయసు పై బడడంతో పాటు పేదరికంతో ఓ హాస్టల్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కాలంలో సీనియర్ నటీనటులను పలకరిస్తూ.. వారి గురించి ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న పాపులర్ యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీ వారు చెన్నైలో తారసపడిన పాకీజాను ఇంటర్వూ చేశారు. దీంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. అయితే సుమన్ టీవీ వారు ఆమెకు భోజనం పెట్టించి, అప్పటికప్పుడు కొంత ఆర్థికసాయాన్ని అందించారు. దీంతో పలువురు పాకీజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

పాకీజా వీడియో చూసి మెగా బ్రదర్ నాగబాబు చలించిపోయారు. తన వంతు ఆమెకు ఓ లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘పాకీజాగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఒక ఆర్టిస్టు ఇప్పుడు ఇలా కష్టాల్లో ఉండటం బాధగా ఉంది. బుల్లితెర కానీ, సినిమాల్లో కానీ.. చిన్నదో పెద్దదో ఒక పాత్ర ఆవిడకు ఇచ్చి మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడేందుకు పరిశ్రమ వారు సాయపడాలి. నావంతు ప్రయత్నం కూడా చేస్తాను’’ అన్నారు.

అలాగే ఇంటర్వ్యూ చేసే సమయంలో నాగబాబు, వాసుకితో వీడియో కాల్‌లో మాట్లాడారు. నాగబాబు సాయం చేశారని తెలుసుకున్న పాకీజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎదురుగా ఉంటే నాగబాబు కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తమిళ్‌లో అన్ని సినిమాలు చేసినా ఏ ఒక్కరూ ఒక్క వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదని.. ఇప్పుడు ఒక ముద్దు తింటున్నానంటే అది తెలుగు వాళ్లు పెట్టిన భోజనమే అంటూ వాసుకి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nagababu
  • #Actress Pakeezah Vasuki
  • #Nagababu
  • #Pakeezah Vasuki

Also Read

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

related news

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Sai Durgha Tej: ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

trending news

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

5 hours ago
Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

1 day ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

2 days ago
Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

2 days ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

2 days ago
ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version