టాలీవుడ్ లో మెగా హీరోల సక్సెస్ రేట్ చాల ఎక్కువే అని చెప్పాలి. చిరంజీవి వేసిన పునాది పై పవన్, చరణ్, అల్లు అర్జున్ వంటి వారు స్టార్ డమ్ కోటలు కట్టేశారు. ఈ ముగ్గురు హీరోలు స్టార్ హీరోల లిస్ట్ లో ఉన్నారు. ఇక అదే ఫ్యామిలీ లో స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆస్కారం ఉన్న ఇద్దరు హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్. వీరిద్దరూ 2014 లో హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. వరుణ్ ముకుందా చిత్రంతో హీరో కాగా, ధరమ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ ఇద్దరు హీరోల స్టార్ డమ్ కొంచెం అటూ ఇటూగా సమానంగా ఉంది. ఐతే సక్సెస్ రేట్ పరంగా వరుణ్ ముందంజలో ఉన్నారు.
ఈ ఇద్దరు మెగా హీరోల పారితోషికం విషయంలో వరుణ్ దే పై చేయి అని తెలుస్తుంది. తొలిప్రేమ, ఫిదా, ఎఫ్ 2 వంటి వరుస హిట్స్ తరువాత వరుణ్ తన పారితోషికం భారీగా పెంచేశాడని తెలుస్తుంది. ఈ మెగా హీరో ఒకప్పుడు 2-3 మూడు కోట్లు సినిమాకు తీసుకునేవాడట. కొంచెం సక్సెస్ ట్రాక్ ఎక్కాక దానిని 5కోట్లకు పెంచాడట. తాజా సమాచారం ప్రకారం దాదాపు డబుల్ డిజిట్ డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఈయన గత చిత్రం గద్దలకొండ గణేష్ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిన వరుణ్ 9-10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.
ఆరంభంలో దూసుకెళ్లిన సాయి ధరమ్ తరువాత వరుస పరాజయాలతో వెనుక బడ్డాడు. గత ఏడాది మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా ధరమ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించింది. దీనితో మొన్నటి వరకు 2-2.5 కోట్లు తీసుకున్న ధరమ్ ప్రస్తుతం 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఈ విధంగా సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకొనే పనిలో ఉన్నారట ఈ మెగా హీరోలు.