సూపర్ పార్టీ చేసుకున్న మెగా హీరోలు.!

పండుగలను, కుటుంబ వేడుకలను మెగా హీరోలు అందరూ ఒకేచోట కలిసి బాగా జరుపుకుంటుంటారు. ఇప్పుడు వారికి ఒకేసారి రెండు పండుగలు వచ్చాయి. అవి రామ్ చరణ్ తేజ్ రంగస్థలం 150 కోట్ల కలక్షన్స్ క్రాస్ చేయడం.. మరొకటి అల్లు అర్జున్ పుట్టినరోజు. రెండింటికి కలిపి ఒకేసారి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు (Mega Party). ఈ పార్టీలో బర్త్ డే బాయ్ బన్నీ, స్నేహ‌, చిట్టి బాబు రామ్ చరణ్, ఉపాస‌న‌, సాయిధ‌ర‌మ్‌, నీహారిక‌, సుష్మిత , శ్రీజ‌ల‌తోపాటు మెగాఫ్యామిలీకి చెందిన వారంతా క‌లిసి గ్రాండ్ పార్టీ చేసుకున్నారని సమాచారం. సాంగ్స్, డ్యాన్స్ మాత్రమే కాదు సరదాగా ఆటలు కూడా ఆడుకున్నారని తెలిసింది. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఒకటి కూడా బయటికి రాలేదు. ఈ మధ్య లీకులగోల ఎక్కువకావడంతో ఇతరులను ఈ పార్టీకి ఎవరినీ పిలవలేదని తెలిసింది.

ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ “నా పేరు సూర్య‌” సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రచయితగా హిట్స్ అందుకున్న వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి.. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ యాంగ్రీ సోల్జర్ గా కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తి అయినప్పటికీ కొన్ని సీన్స్ సంతృప్తిగా రాకపోవడంతో వాటిని రీషూట్ చేస్తున్నట్టు తెలిసింది. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్, శేఖర్ లు సంగీతమందిస్తున్నారు. వచ్చే నెల థియేటర్లోకి రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus