మెగాస్టార్ తో కొత్త జోనర్ ట్రై చేస్తున్న కొరటాల?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇది మెగాస్టార్ కు 151వ చిత్రం కావడం… అందులోనూ ఆయన డ్రీం ప్రాజెక్ట్ కావడంతో స్వయంగా ఆయన కొడుకు.. మెగా పవర్ స్టార్ రాంచరణే .. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న విడుదల ప్లాన్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, అనుష్క వంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తుండడంతో మంచి హైప్ ఏర్పడింది. ఇక మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెసేజ్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు . ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. గోవింద, ఆచార్య అనే రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెగాస్టార్ కనిపిస్తారట. మెగాస్టార్ పుట్టినరోజు అయిన ఆగష్టు 22న ఈ చిత్రం పూజా కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ నుండీ ఉంటుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus