‘ఆర్.ఆర్.ఆర్’ లో కీలక సన్నివేశాన్ని బయటపెట్టేసిన చిరు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఏకంగా 285 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు చరణ్. ఇక అక్టోబర్ 2 న ఈ చిత్రం విడుదల. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు వంటి బడా స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది.

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ మాట్లాడుతూ ‘ఆర్.ఆర్.ఆర్’ లోని కీలక సన్నివేశాన్ని లీక్ చేసేసారు. చిరంజీవి మాట్లాడుతూ… ” ఈ చిత్రానికి చరణ్ కాకుండా మరో నిర్మాత అయితే సినిమా ఇంత భారీ రేంజ్ లో రూపొందేది కాదు. కొద్ది రోజుల క్రితం నా భార్య సురేఖతో కలిసి నేను ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ షూటింగ్ చూడడానికి వెళ్ళాను. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు… తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో భాగం కావడానికి ముందు ప్రిపరేషన్ కి సంబంధించిన కీలక సన్నివేశాల్ని దర్శకుడు రాజమౌళి భారీ స్థాయిలో రాంచరణ్ పై చిత్రీకరిస్తున్నాడట. ఆ సీన్ లో చరణ్ పడ్డ కష్టం చూసి మా ఇద్దరికీ గుండె ఎంతో బరువెక్కింది” అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఓ పక్క హీరోగా భారీ ప్రాజెక్ట్ లో నటిస్తూనే.. మరోపక్క తనతో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న తన కొడుకుని చూసి మురిసిపోతూ మెగాస్టార్ ఈ విషయాన్ని తెలిపారు.

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus