ఆ 5 నిమిషాల సీన్ అద్భుతమే కానీ..?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన బలం మాస్ ప్రేక్షకులు. అప్పటి స్టార్ హీరోలైన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటివారు దూసుకుపోతుంటే.. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మాత్రం మాస్ సినిమాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నారు. కేవలం మాస్ సినిమాలే చేస్తే స్టార్ అయిపోయారు అనేది కాదు… తన డైన్స్ లు, స్టైల్, ఫైట్ లు కూడా అందులో కీలక పాత్ర పోషించాయి. స్టార్ హీరో అయినప్పటికీ అన్ని రకాల పాత్రలను మెగాస్టార్ పోషిస్తూ వచ్చారు.

స్టార్ హీరో అయ్యుండి కూడా ‘స్వయంకృషి’ చిత్రంలో చెప్పులు కొట్టుకునే పాత్ర పోషించారు. ఇక ‘ఆరాధన’ ‘రుద్రవీణ’ వంటి సినిమాల్లో కూడా విభిన్న పాత్రలు చేసి మెప్పించారు. అయితే పౌరాణిక చిత్రాల విషయంలో మాత్రం మెగాస్టార్ చాలా వెనుకపడే ఉన్నారు అన్న విషయం వాస్తవం. ఆ ఒక్క అసంతృప్తి మెగా అభిమానులకు మాత్రం ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. ‘శివుడు శివుడు శివుడు’ , ‘ఆపద్బాంధవుడు’, ‘శ్రీమంజునాథ’ వంటి చిత్రాల్లో కొద్దిగా టచ్ చేశారు కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.

‘రామాయణం’ , ‘మహాభారతం’ లోకి కీలక పాత్రలు మెగాస్టార్ పోషిస్తే చూడాలి మెగా అభిమానులు ఇప్పటికీ కోరుకుంటున్నారు. అయితే మెగాస్టార్ కూడా అర్జునుడి పాత్ర ఓ సినిమాలో పోషించాడు. అదే ‘స్టేట్ రౌడీ’ సినిమా. బి.గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని టి.సుబ్బిరామి రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో 5 నిముషాలు మెగాస్టార్ అర్జునుడి పాత్రలో కనిపిస్తారు. ఈ సీన్ కూడా చాలా బాగా చిత్రీకరించారు. అయితే ఈ చిత్రం కూడా ఎబౌవ్ యావరేజ్ రేంజ్లోనే ఆడింది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus