Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » చక్కటి మెసెజ్..కమర్షియల్ పంథాలో రూపొందిన శ్రీ‌కారం: చిరంజీవి

చక్కటి మెసెజ్..కమర్షియల్ పంథాలో రూపొందిన శ్రీ‌కారం: చిరంజీవి

  • March 9, 2021 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చక్కటి మెసెజ్..కమర్షియల్ పంథాలో రూపొందిన శ్రీ‌కారం: చిరంజీవి

వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు  రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం శ్రీకారం. ప్రియాంక  అరుళ్ మోహన్ హీరోయిన్ గా న‌టిస్తోన్న‌ ఈ చిత్రంలోని ఇప్ప‌టికే విడుద‌లైన‌ పాటలకు, ట్రైలర్స్ కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది..హై ఎక్స్ పెక్టేషన్స్ తో మహాశివరాత్రి సందర్బంగా మార్చి11న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా ఖమ్మంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ‌కారం బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు కిషోర్ బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట. రైటర్ సాయి మాధవ్ బుర్రా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదిత‌రులు పాల్గొన్నారు.

సింగ‌ర్, ర‌చ‌యిత‌ పెంచల్ దాస్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం ముందుగా శ్రీకారం నిర్మాతలు గోపీ, రామ్ ఆచంట డైరెక్టర్ కిషోర్ గారికి నమస్కారం.. ఈ మూవీలో భలేగా ఉంది బాలా.. అనే పాటను ఇంత బాగా ఆదరించారు.. దీనికి మూలం రాయలసీమ మూలం.. సేద్యం నేపథ్యం మూవీ కాబట్టి.. పట్టుబట్టి రాయించారు. నన్నే పాడ మన్నారు.పాడాను.. అద్భుతంగా ఆదరించారు.. ఈ మూవీ నేపథ్యం వ్యవసాయం కాబట్టి.. పట్టుకుని పాయింట్. తీశారు.. బాగా వచ్చింది.. మీ అందరూ ఆదరిస్తారు.. అట్లాగే ఈ పాట ఈ చిత్తూరు నేపథ్యంలో ఉన్న మూవీ కాబట్టి.. ఆ పాట యాప్ట్ అయిందని అనుకుంటున్నాను. డైరెక్టర్, గోపీ గారు అందరూ ప్రోత్సహించారు.. రాయించి పాడించారు. పెద్ద స్థాయికి వెళ్లింది.. పాట పాడి అందరినీ అలరించారు..

న‌టుడు రావు రమేష్ వీడియో ద్వారా సందేశాన్ని అందించారు. అందులో..‘శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన చిరంజీవి గారికి థ్యాంక్స్.. ఇండస్ట్రీలో మంచి చెడుకి.. ఏం కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భుజాన్ని ఇచ్చి..ఈ ఇండస్ట్రీని ఆదుకుని ధైర్యాన్నిచ్చే ఆ మహోన్నత వ్యక్తి ఈ ఈవెంట్‌కు రావడం మా శ్రీకారానికి మరింత మెరుగు, గొప్పదనాన్ని సంతరించుకునేలా చేసింది. నేను రాలేకపోయినందుకు క్షమించండి.. మా హీరో శర్వానంద్ గారికి ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ఆయనెప్పుడూ వెరైటీ కథలను ఎంచుకుంటారు.. సెన్సిబుల్ సినిమాలను చేస్తుంటారు.. ఆయన సినిమాను అంగీకరించడం ఇంత నిజాయితీ సినిమా. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వ్యవసాయం చేయడం లాభసాటి కాదని అంటారు.. వ్యవసాయం మీద సినిమా తీయాలంటే దానికి చాలా కన్విన్షన్ కావాలి.. మా నిర్మాతల (రామ్ ఆచంట, గోపీ ఆచంట)కు సక్సెస్ రావాలి.. కథ చెప్పేటప్పుడు ఎంత నిజాయితీగాచెప్పాడో.. తీసేపటప్పుడు కూడా అంతే నిజాయితీగా తీశాడు. పరిణితి చెందిన దర్శకుడు కొన్ని సీన్స్ ఎలా పండిస్తారో అలా పండించాడు.. అతనిలో ఉన్న జెన్యూనిటీ సినిమాకు చాలా పెద్ద బలం.. ఆయనకు కూడా పెద్ద సక్సెస్ రావాలి అలాగే టీం అందరికీ సక్సెస్ రావాలి’ అని కోరుకున్నారు.

సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. ఈ రోజు ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది..నేను మెగాస్టార్ అనే నక్షత్రం ప్రసరించిన వెలుగులోంచి దారి చూసుకుంటూ నడుస్తున్నాను.. నేనే కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఆ మెగాస్టార్ వెలుగు నుంచి వచ్చిన దారి చూసుకుంటూ నడుస్తోంది. ఇండస్ట్రీని నడిపిస్తున్నఆ వెలుగు శ్రీకారం టీంను ఆశీర్వదించడానిక వచ్చిందంటే.. విజయానికి ఇదే శ్రీకారం.. చిరంజీవి గారు ఆశీర్వదించడానికి వచ్చారంటే 150పై చిలుకు సినిమాలు ఆశీర్వదించినట్టు.. ఆయన సృష్టించిన ఎన్నో సంచలనాలు ఈ శ్రీకారాన్ని ఆశీర్వదించినట్టు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మెగా అభిమానులు ఆశీర్వదించినట్టు. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుంది. ఇలాంటి సినిమాల్లోభాగమైనందుకు గర్వంగా ఉంది.. నా సినిమాల్లో మేజర్ షేర్.. మెగా ఫ్యామిలీ ఆశీస్సులతో రాసినవే.. ఖైదీ నెంబర్ 150, సైరా, ఆర్ఆర్ఆర్, అంతకు ముందు సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, ఇప్పుడు క్రిష్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ఇలా అన్నీ కూడా మెగా ఫ్యామిలీకే రాశాను.. మెగాస్టార్ గారి ఆశీస్సులే నడిపిస్తన్నాయి. ఖైదీకి రాశాను కాబట్టే ఈ సినిమా వచ్చిందని అనుకుంటున్నాను.. అది రాయకపోతే ఇది వచ్చేది కాదు.. శ్రీకారం హ్యూమన్ ఎమోషన్స్‌ అన్నీ ఉండే అందమైన ఆహ్లాదమైన సినిమా.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు తరువాత శర్వానంద్ గారితో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తానా? అని ఎదురుచూస్తున్న సమయంలో కిషోర్ ఈ కథ చెప్పినప్పుడు నిజంగా చాలా హ్యాపీ. మొదటి నుంచి చివరి వరకు ప్రతీ సీన్‌లో జీవం ఉంది.. క్యారెక్టర్‌లో జీవం ఉంది. అన్నీ ఎమోషన్స్ ఉన్నాయి.. ఆకాశం నుంచి ఊడిపడ్డ క్యారెక్టర్స్ ఈ సినిమాలో కనిపించవు.. మనకు తెలిసిన పాత్రలు మనమే కనిపిస్తుంటాం.. మనకు తెలిసిన వాళ్లో.. విన్నవాళ్లో కన్న వాళ్లో.. మన స్నేహితులో కనిపిస్తుంటారు.. ఇలాంటి మంచి సినిమా కోసం పని చేయడం మన బాధ్యత. సినిమా తీయడం బాధ్యత.. నిర్మాతలు బాధ్యతగా ఫీలై ఈ సినిమాను తీశారు. ప్రాణం పెట్టి పని చేశారు. ఇక డైరెక్టర్ కిషోర్.. కొత్త దర్శకుడిలా అనిపించడు.. చాలా సీనియర్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు ఎలా చేస్తాడో.. చేయించుకుంటారో అలాగే చేశారు.. నాతో కూడా రాయించుకున్నారు.. రావురమేష్ పలికిన చిత్తూరు స్లాంగ్‌ క్రెడిట్ మొత్తం ఆయనదే. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా చేశారు.. శ్రీకారం సినిమాకు పని చేసినందుకు గర్వంగా.. అందరికీ థ్యాంక్స్’అని అన్నారు.

హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడుతూ.. “అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను.. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్.. మీ డ్యాన్స్‌లకు నేను అభిమానిని. ఈ సినిమాకు పని చేసినందుకు ఎంతో గర్వంగా ఉంది.. ఇంత మంచి కథ రాసినందుకు డైరెక్టర్‌కు థ్యాంక్స్. నాకు ఈ పాత్ర బాగా నచ్చింది. అందుకే సినిమా చేయాలని అనుకున్నాను. నా నిర్మాతలకు థ్యాంక్స్. ఇంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు డీఓపీ యువరాజ్, నటనలో సహకరించినందుకు శర్వాకు థ్యాంక్స్.. అందరికీ థ్యాంక్స్.. మార్చి 11న శ్రీకారం రాబోతోంది. మీ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి.. అందరూ మాస్క్ వేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి’ అని కోరుకున్నారు.

న‌టుడు సాయి కుమార్ వీడియో సందేశాన్ని పంపించారు. అందులో.. “పొలాలనన్నీ హలాల దున్ని.. అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని చెప్పి అందరినీ ఉత్తేజపరిచారు. రైతు చెమటకు ఖరీదు లేదు.. రైతు దేశానికి వెన్నెముక.. ఆయనే లేకపోతే.. మనమూ లేము.. దేశం లేదు.. రైతే రాజు..మార్చి 11న రైతుకు పట్టాభిషేకం చేసేందుకు వస్తోన్న శ్రీకారం. ఈ రోజు ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.. ఖమ్మం ప్రజానీకానికి పేరుపేరును వందనం అభివందనం.. శ్రీకారానికి శుభమస్తు అంటూ ఆశీర్వదించేందుకు వస్తోన్న అన్నయ్య చిరంజీవి హృదయ పూర్వక ధన్యవాదాలు. సినీ పరిశ్రమంలో అందరికీ అండగా నిలిచే అందరివాడు అన్నయ్య ఆచార్య.. మీరు రావడం కొండంత అండనిచ్చింది. చాలా ఆనందంగా ఉంది.. చాలా చాలా థ్యాంక్స్. ప్రస్థానం తరువాత నా మిత్ర(శర్వానంద్‌)తో చేస్తోన్న మరో మంచి సినిమా శ్రీకారం. హీరో శర్వా, టెక్నీషియన్స్, మా మంచి మొదటి డైరెక్టర్, నిర్మాతలకు అభినందనలు.. రాకపోయినందుకు క్షమించండి.. శ్రీకారాన్ని దిగ్విజయం చేయండి.. గ్రామ రాజ్యం రామ రాజ్యం జై రైతన్న.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..’ అని ముగించారు.

డైరెక్టర్ కిషోర్. బి మాట్లాడుతూ.. “చిరు సర్. థ్యాంక్యూ సో మచ్.. న్యూ ఇయర్ వస్తే. కార్డుపై ఫోటోలు.. స్కూల్‌లో.. టికెటు్లు దొరక్పోతే.. డోర్ బయటప.. మా సినిమాకు ఇలా గెస్ట్‌గా రావవం.. ఓ సారి కళ్లు అలా చూస్తే చాలని,పించింది.. నేను ఇక్కడ నిలబడింది.. ఆ షార్ట్ ఫిలం వల్ల కాదు.. మీ వల్ల.. నా పేరెంట్స్ లా నా వెనకలా నిలబడ్డారు.. మీరు లేకపోతే నేను ఇక్కడ ఉండలే.. అన్నా అని చెప్పుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతాను.. హిట్ అవుతుందని .. ప్రియాంకకు థ్యాంక్స్.. డీఓపీ ఇక్కడ లేకపోయినా.. ఆయన విజువల్స్ ఇకనిప.. ఎడిటిర్ మార్తాండ్ కే వెంకటేష్ పక్కన నిలబడితే.. ధైర్యంగా ఉంటుందో తెలిసింది.. మిక్కీ జే మేయర్.. నేను లేటుగా పంపినా కూడా మీరు మాత్రం లేట్ చేయలేదు.. ఆర్ట్ డైరెక్టర్.. అందరికీ థ్యాంక్స్ అక్షరాలు అడిగితే జీవాన్ని పోశారు.. గురువు గారు సాయి మాధవ్.. మనమంత వ్యవసాయం కష్టం.. ఇస్టం.. ప్రేమ.. ఎంత సహజంగా ఉంటాకో.. అంతే సహజంగా ఉంటాయి.. ఒకటికి పది సార్లు చేశఆం.. నచ్చతుందని ఆశిస్తున్నాం.. వాళ్లు బాగుందని చెబితేనే వెళ్లండి.. కోవిడ్ వల్ల బయటకు రాలేకపోయరాు.. వాళ్లని తీసుకొద్దాం.. మా రామ్ గారు.. ప్రతీ పాట చూపించేవారు.. రామ్ గారి కళ్ళల్లో చూస్తుంటే.. ఓ పూనకం వస్తున్నట్టుంది.. గోపీ సార్.. పేరెంట్స్ స్థానంలో మీరు నిలబడ్డారు.. అందరికీ థ్యాంక్స్.. నా టీం, తల్లిదండ్రులకు అందరికీ థ్యాంక్స్ అని అన్నారు.

నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ.. ‘మా శ్రీకారం టీంని విష్ చేసేందుకు వారి అమూల్యమైన ఆశీర్వచనాలు అందించేందుకు వచ్చిన చిరంజీవి గారికి థన్యవాదాలు. మీరు ఇచ్చే సపోర్ట్ మాటల్లో చెప్పేందుకు సరిపోదు.. పుష్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ ఈవెంట్‌ నిర్వహించేందు సపోర్ట్ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కి థ్యాంక్స్. వ్యవసాయం చేద్దామని చూసిన ఓ కుర్రాడికి ఎదురైన సమస్యలు, ఎందుకు వ్యవసాయం చేద్దామని అనుకున్నాడని చెప్పేదే శ్రీకారం.. అద్భుతమైన డైలాగ్స్ ఇచ్చిన సాయి మాధవ్ బుర్రా, అద్భుతమైన రీ రికార్డింగ్. ఎడిటర్ మార్తాండ్, డీఓపీ యువరాజ్ ఇలా అందరికీ థ్యాంక్స్. హీరోయిన్ ప్రియాంక రిలీఫ్ ఇస్తుంది.. శర్వానంద్ ఈ పాత్రను అద్భుతంగా పోషించాడు.. అలా జీవించేశారు.. ఎంతో ఎమోషనల్‌గా రాసుకున్నాడు.. హృదయం లోతుల్లోంచి వచ్చిన ఎమోషన్స్.. అందుకే అంత బాగా పండిందని అనుకుంటున్నాను.. మేం సినిమా చూశాం.. బాగా వచ్చింది.. మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా’ అని అన్నారు..

తమ ఆతిథ్యం స్వీకరించినందుకు గానూ మమత ఎడ్యుకేషనల్ సొసైటి తరుపున చిరంజీవికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిరు సత్కారం చేశారు. అనంతరం తెలంగాణ మంత్రి పువ్వాడ‌ అజ‌య్ కుమార్ మాట్లాడుతూ – “పెద్దలు, మనందరికి అన్నయ్య ఆచార్య మెగాస్టార్ చిరంజీవి గారు.. ముఖ్య అతిథిగా ఉన్న శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాల్గొన్న వర్దమాన నటుడు శర్వానంద్, అరుళ్ మోహన్, దర్శక నిర్మాతలు, చిత్రయూనిట్‌కు నమస్సుంజాలి తెలియజేస్తున్నాను.. ఈ ఈవెంట్‌కు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం చిరంజీవి. మీరు ఖమ్మంలో ఒక్క షెడ్యూల్‌ అయినా చేయాలని కోరాను. ఆ కోరిక మేరకు కొరటాల శివ గారితో చెప్పించారు. కంటికి రెప్పలా చూసుకో అని కేటీయార్ గారు ఆదేశం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి నేను మీ అభిమానిని. మార్నింగ్ షోకే వెళ్లి బ్రహ్మాండంగా డ్యాన్సులు, స్టెప్పులు వేసిన వాళ్లలో మేం ఉన్నాం. బావగారూ బాగున్నారా సినిమా డిస్ట్రీబ్యూషన్ కూడా చేశాం.. మీరు కేంద్రమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పని చేశారు.. సినీ పరిశ్రమకు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు.. బ్లడ్ అండ్ ఐ బ్యాంకుల ద్వారా ఎంతో మందికి సాయమందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి స్ఫూర్తిదాయకం. ఆచార్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ – `బాస్ ముందు మాట్లాడాలంటే ఏదో టెన్షన్‌లా ఉంది. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. ఏ పాయింట్ మరిచి పోకూడదని రాసుకుని మ‌రీ వచ్చాను.. మొదటి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్.. నేను మొదట‌ చూసిన విజయం.. శ్రీకారం చుట్టింది కూడా ఆయనే.. మా శ్రీకారానికి ఇలా గెస్ట్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది.. శ్రీకారం సక్సెస్ అనేది ఆయన ఈ ఫంక్షన్‌కు రావడానికి ఒప్పుకున్నప్పుడే .. ఒక్క మాట చెప్పాడు.. శర్వా.. నీ సంకల్పం గొప్పదే.. దేవుడు నీ తలరాతను తిరిగి రాస్తాడు.. ఆ మాట గుర్తు చేసుకుంటూనే ఉంటాను.. ఆ సంకల్పమే నా స్టార్‌ను మార్చింది.. నన్ను స్టార్‌ను చేసింది.. అందుకే ఇలా నిలబడ్డాను.. ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి.. నేను గర్వంగా చెప్పుకునే పేరు.. నా మిత్రుడు రామ్ చరణ్..ట్రైలర్ చూశాకా ఫస్ట్ ఫోన్ కాల్ రామ్ చరణ్ నుంచి వచ్చింది. ఈ సినిమా ఆడాలి.. ఆడుతుంది.. ఏ సాయం కావాలి చెప్పు చేస్తాను అని అన్నాడు. వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి శర్వా సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మనం సాయం చేయాలి అన్నాడు. వారసత్వం ద్వారా ప్రాపర్టీస్ వస్తాయ్ కానీ చిరంజీవి గారి క్యారెక్టర్ వారసత్వం ద్వారా రామ్ చరణ్‌కు వచ్చింది.. ఇంకెవ్వరికీ దక్కదు. అది కేవలం నా ఫ్రెండ్ చరణ్‌కే సొంతం. థ్యాంక్యూ చరణ్.. నాకు సపోర్ట్ ఇచ్చినందుకు.. నా మంచి కోరుకునే చిరంజీవి, రామ్ చరణ్‌లకు నా సినిమాలు ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూనే ఉంటాయి. ఈ సినిమాలో కావాల్సినంత ప్రేమ, సరిపోయే కామెడీ, సెంటిమెంట్స్, ఏడిపించే విలన్. అన్నం పెట్టే భూమి, నవ్వించే నాన్న.. అందమైన అమ్మాయి.. వీటి చుట్టూ తిరిగే అబ్బాయి. అన్నీ ఉంటాయి.. జై జవాన్.. జై కిసాన్.. జై హింద్’ అంటూ ముగించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘సరిగ్గా 12 ఏళ్ల క్రితం నాటి ప్రజా అంకిత యాత్ర పేరుతో ఈ ఖమ్మంలో ప్రచారం చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు ఇప్పుడూ అదే ప్రేమను చూపిస్తున్నారు. మీ అభిమానం చెక్కుచెదరలేదని తెలుస్తోంది. పోరాటాల ఖమ్మానికి, ఖమ్మం ప్రజలకు యావన్మందికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేదిక మీదున్న రవాణా శాఖ మంత్రి అజయ్ గారికి, శ్రీకారం యూనిట్ సభ్యులందరికీ శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు అనుకోకుండా దొరికిన అదృష్టం ఇది. చరణ్ ఫోన్ చేసి.. శర్వా సినిమా విడుదలవుతోంది.. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని అన్నాడు. అలా ఎలా నేను ఖమ్మంలో ఉన్నాను కదా? అని అన్నాను. వాళ్లే ఖమ్మంకు వస్తారు అని చెప్పాడు. అయితే ఖమ్మంలో అయితే జనాలు వస్తారా? అని అనుమానం ఉండేది. శ్రీకారం యూనిట్‌కు మాత్రం జనాలువస్తారు.. ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. మీరు ఇంత మంది వచ్చి ఆదరిస్తూ వారి నమ్మకాన్ని నిజం చేశారు.. ఎంతో మంచి కథ, వ్యవసాయం గొప్పదనం చెప్పే కథ..ఈ సినిమాలో సందేశమే కాదు.. అన్ని రకాల కమర్షియల్ హంగులున్నాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. హీరో హీరోయిన్లు, చిత్రయూనిట్ అందరికీ నా అభినందనలు ఈ ఈవెంట్‌కు రావడానికి నిర్మాతలు ముఖ్య కారణం అయితే.. శర్వానంద్ కూడా ఓ కారణం.. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే రామ్ చరణ్‌తో పెరిగాడు.. నాకు శర్వానంద్ బిడ్డలాంటివాడు.. మరో రామ్ చరణ్. అయితే నటన పట్ల మక్కువ ఉందో లేదో కూడా నాకు తెలీదు.. రామ్ చరణ్‌ను అడిగితే.. నాకు తెలీదు డాడీ అనేవాడు. ఓ సారి థమ్సప్ యాడ్ గురించి యంగ్ బాయ్ నటించాల్సి వచ్చింది. ఎవరైతే బాగుంటుందా? అని అనుకునే సమయంలో.. శర్వానంద్ ఇంట్లో ఉన్నాడు.. నటిస్తావా? శర్వా అని అడిగితే.. అంకుల్ మీరు చెబితే చేస్తాను అన్నాడు.. ఆ మాట చాలు అని తీసుకెళ్లాను. అలా మేం ఇద్దరం వెళ్లి యాడ్‌లో నటించాం.. అదే మొదటి సారి కెమెరా ముందు కనిపించడం. ఏదీ కూడా ఎక్కువగా చెప్పడు. మాట్లాడడు. శర్వానంద్ చాలా సాత్వికుడు. అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఓ సాంగ్ సీన్‌లో కుర్రాడు కావాలి. ఎంతో అమాయకంగా కనిపించాలి. శర్వా అయితే బాగా చేస్తాడు అని అనుకున్నాను. నటిస్తావా? అని అంటే.. మీ సపోర్ట్ ఉంటే చేస్తాను అన్నాడు. అలా గెస్ట్ క్యారెక్టర్ చేశాడు. అప్పుడే నాకు అర్థమైంది.. పెద్ద హీరో అవుతాడని.. ఆ సీన్ తన నటనకు ఓ మచ్చుతునక అని చెప్పవచ్చు. నాడే శర్వా నటనకు శ్రీకారం పడింది అక్కడే.. నటనకు తిలకం దిద్దింది కూడా నేనే. సినిమా సినిమాకు పరిణతి కనిపిస్తూ.. శ్రీకారం సినిమాతో మీ ముందుకురాబోతోన్నాడు.. సక్సెస్ కాబోతోందని సగర్వంగా చెబుతున్నాను..సమయం లేకపోవడంతో కొంత సినిమానే చూశాను. ఎంతో చక్కటి మెసెజ్.. కమర్షియల్ పంథాలో దర్శకుడు కిషోర్ అద్భుతంగా చెప్పారు. నేటి యువతరానికి వ్యవసాయ విలువ తెలిసేలా చూపించారు. త‌ప్ప‌కుండా ఈ సినిమా అద్భుత విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 Reels Plus banner
  • #Amani
  • #Avinash Kolla
  • #Chiranjeevi
  • #Gopi Achanta

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

11 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

12 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

12 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

14 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

7 hours ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

8 hours ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

8 hours ago
Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

9 hours ago
Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version