Megastar Chiranjeevi: చిరంజీవి ఈ సంవత్సరం పుట్టిన రోజు అక్కడే!

మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పటిలాగే ఆయన ఇంటితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు కూడా చిరు జన్మదిన వేడుకలు చేసుకున్నారు. అయితే చిరంజీవి గత ఆనవాయితీకి భిన్నంగా ఈసారి పుట్టిన రోజు వేడుకలు వేరే ప్రాంతంలో జరిగాయి. దీంతో అక్కడి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈసారి చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు కామారెడ్డి జిల్లా దోమకొండలోని గడీ కోటలో జరిగాయి. చిరు జన్మదిన వేడుకల్లో రామ్‌చరణ్‌ తేజ్‌ దంపతులతో పాటు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో చిరంజీవి కేక్‌ కట్‌ చేసి బర్త్‌ డే జరుపుకున్నారు. ఆయనకు వియ్యంకుడు కామినేని అనిల్‌కుమార్‌, శోభనతోపాటు కుటుంబ సభ్యులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మామూలుగా చిరంజీవి జన్మదినం బెంగళూరులో జరుగుతూ ఉంటుంది. ఏటా ఆగస్టు 22 నాటికి కుటుంబసభ్యులు మొత్తం బెంగళూరులో చిరంజీవి కుటుంబ ఫామ్‌ హౌస్‌కి వెళ్లిపోతారు. మొత్తం కుటుంబం ఆ రోజు అక్కడ ఉండేలా చిరంజీవి చూసుకుంటారని, గతంలో కుటుంబసభ్యులు కొంతమంది చెప్పారు.

అయితే ఈ ఏడాది దానికి భిన్నంగా పుట్టిన రోజు వేడుకలను తన వియ్యంకుడికి చెందిన గడీకోటలో చేసుకున్నారు చిరంజీవి. ఆయన అక్కడికి వచ్చిన విషయం తెలియడంతో అభిమానులు అక్కడికి చేరుకుని సందడి చేశారు. ఇక చిరంజీవి సినిమాల సంగతి చూస్తే.. ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ను జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. ‘వాల్తేరు వీరయ్య ’ (టైటిల్‌ అధికారికంగా ప్రకటించలేదు) టీజర్‌ పోస్టర్‌ వచ్చింది. ‘భోళా శంకర్‌’లో వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు.

ఇవి తప్ప మిగిలిన అప్‌డేట్స్‌ ఏమీ రాలేదు. చిరంజీవి ఇవి కాకుండా మరో మూడు సినిమాలు ఓకే చేశారు. వాటిని నుండి ఏవైనా అప్‌డేట్స్‌ వస్తాయని అనుకున్నా.. ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. దీంతో అభిమానులు కాస్త నిరాశచెందారు అనే చెప్పొచ్చు. మరి వాటి వివరాలు త్వరలో ఏమన్నా ఇస్తారేమో చూడాలి.

1

2

3

4

5

6

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus