ఆగష్టు 22వ తేదీ చిరంజీవి పుట్టినరోజు అనే విషయం అభిమానులకు తెలుసు. అయితే సెప్టెంబర్ 22వ తేదీ కూడా చిరంజీవి కెరీర్ లో స్పెషల్ డే కావడం గమనార్హం. చిరంజీవి ముఖ్య పాత్రలో నటించిన ప్రాణం ఖరీదు సినిమా విడుదలై నిన్నటికి 44 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
ఆ పోస్ట్ లో చిరంజీవి మీకు తెలిసిన చిరంజీవి, చిరంజీవిగా పుట్టినరోజు 22 సెప్టెంబర్ 1978 అని పేర్కొన్నారు. ప్రాణం ఖరీదు సినిమా ద్వారా ప్రాణం పోసి ప్రాణప్రదంగా నా ఊపిరై నా గుండె చప్పుడై అన్ని మీరే అయి 44 సంవత్సరాలు నడిపించారని చిరంజీవి పేర్కొన్నారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చిరంజీవి తన పోస్ట్ లో పేర్కొన్నారు. చిరంజీవి ట్విట్టర్ లో చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నటుడిగా చిరంజీవి అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. వయస్సు పెరుగుతున్నా చిరంజీవికి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా కథలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందనే సంగతి తెలిసిందే.
Chiranjeevi the Actor as you all know was born today, 22 September 1978, 44 years ago! I owe this limitless love and affection I receive from you all, to this day!
I owe everything to this day!
Humbled and Grateful! 🙏🙏🙏#PranamKhareedu #22Sept1978#DebutMovieRelease pic.twitter.com/LoFcpEo9Zo
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2022
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!