Chiranjeevi: మరోసారి మంచి మనస్సు చాటుకున్న చిరు.. ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి మనస్సు మంచి మనస్సు అనే సంగతి తెలిసిందే. సేవా కార్యక్రమాలు చేసే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారు. తాజాగా చిరంజీవి క్యాన్సర్ ఓపెనింగ్ సెంటర్ కు హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి తనకు క్యాన్సర్ సోకిందని చెప్పకపోయినా అలా చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ కావడం గమనార్హం. అయితే క్యాన్సర్ ఓపెనింగ్ సెంటర్ లో చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి చెందిన తక్కువ ఆదాయం ఉన్న సినీ కార్మికులకు, ఫ్యాన్స్ కు, మీడియా వాళ్లకు క్యాన్సర్ ను ముందుగా గుర్తించే పరీక్షలను నిర్వహించాలని అందుకు అవసరమైన ఖర్చును తానే భరిస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ను ఆస్పత్రులకు అనుసంధానం చేసి క్యాన్సర్ పై పోరాటం చేస్తానని మెగాస్టార్ తెలిపారు. చిరంజీవి చేసిన కామెంట్లు క్యాన్సర్ సెంటర్ నిర్వాహకులను సైతం సంతోషపెట్టాయి. అయితే చిరంజీవి చెప్పిన ఈ కామెంట్ల కంటే చెప్పని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ మూవీ తెరకెక్కుతుండగా భోళా శంకర్ ఫస్ట్ సింగిల్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవికి (Chiranjeevi) జోడీగా తమన్నా నటిస్తుండగా సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. మెహర్ రమేష్ షాడో తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. భోళా శంకర్ మూవీ కోసం చిరంజీవి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus