Chiranjeevi: పాప జాతకం అద్భుతంగా ఉంది.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఈరోజు వేకువజామున ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇలా రాంచరణ్ ఉపాసన దంపతులకు పాప జన్మించారనే విషయం తెలియడంతో అభిమానులు ఇతర సినీ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పాపను చూడటం కోసం మెగా ఫ్యామిలీ రాత్రే హాస్పిటల్ కు చేరుకున్నారు. ఇకపోతే తన మనవరాలిని చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ క్రమంలోనే ఈయన (Chiranjeevi) తన మనవరాలు గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మేము గత కొన్ని సమస్యలుగా రామ్ చరణ్ ఉపాసన ఎప్పుడు వారి బిడ్డను మా చేతులలో పెడతారా అని ఎదురు చూసాము ఆ కల నేటితో నెరవేరిందని తెలిపారు. భగవంతుడి దయవల్ల మాకు ఎంతో ఇష్టమైనటువంటి మంగళవారం రోజున మనవరాలు పుట్టిందని తెలిపారు.

పాప మంగళవారం ఉదయం 1:49 కి పుట్టింది ఎంతో అద్భుతమైన గడియలని పాప జాతకం చాలా అద్భుతంగా ఉందంటూ చిరంజీవి తెలిపారు. అయితే పాప జాతక ప్రభావం మా ఇంటి పై ఉందని చిరంజీవి తెలిపారు. పాప జాతకం వల్లే రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగారు అలాగే వరుణ్ తేజ్ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇలా పాప జాతకం చాలా అద్భుతంగా ఉంది అంటూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus