Chiranjeevi: చిరంజీవి ఖాతాలో మరో అరుదైన ఘనత.. ఏం జరిగిందంటే?

  • August 11, 2023 / 09:25 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. చిరంజీవి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పాజిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా తమకు ఎంతగానో నచ్చిందని చిరంజీవి కెరీర్ లో భోళా శంకర్ స్పెషల్ మూవీ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయి.

చిరంజీవి అభిమానులు కొంతమంది చిరంజీవిపై తమకు ఏ స్థాయిలో అభిమానం ఉందో ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పేశారు. గూగుల్ మ్యాప్స్ లో చిరంజీవి చిత్రాన్ని గీసిన అభిమానులు అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ చిరంజీవిపై అభిమానాన్ని ప్రదర్శించిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి.

చిరంజీవి (Chiranjeevi) ఫేస్ ను పోలి ఉండేలా గూగుల్ మ్యాప్ ను సిద్ధం చేయడంతో పాటు 800 కిలోమీటర్ల చెక్ పాయింట్స్ ను పెట్టుకుని జీపీఎస్ నావిగేషన్ తో కలుపుతూ చిరంజీవి బొమ్మను గూగుల్ మ్యాప్స్ పై కనిపించేలా చేయడం గమనార్హం. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి నటనకు నెటిజన్ల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. చిరంజీవి డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

భోళా శంకర్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం గురించి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా మంచి సినిమాగా నిలుస్తుందని ఫీలవుతున్నారు. భోళా శంకర్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేసే స్థాయిలో భోళా శంకర్ తో కలెక్షన్లను సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus