Chiranjeevi: ఆ విషయంలో చిరంజీవి నిర్ణయం రైట్.. ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటంటూ?

  • September 22, 2023 / 06:38 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో సుస్మిత కొణిదెల నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా భోళా శంకర్ సినిమా డిజాస్టర్ రిజల్ట్ వల్ల ఈ సినిమా లేనట్టేనని తెలుస్తోంది. చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబో మూవీ బ్రో డాడీ రీమేక్ కావడంతో రీమేక్ ల విషయంలో నెగిటివ్ కామెంట్లు వస్తుండటంతో చిరంజీవి వెనక్కు తగ్గారని తెలుస్తోంది.

మరోవిపు నవంబర్ నెల మొదలయ్యే వరకు చిరంజీవి షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారని సమాచారం. కొంతకాలం క్రితం చిరంజీవికి మోకాలి సర్జరీ జరిగిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కర్ర సాయంతో నడుస్తున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబినేషన్ మూవీ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. చిరంజీవి పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. కళ్యాణ్ కృష్ణ పరిస్థితి ఏంటనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

చిరంజీవి పారితోషికం 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది. చిరంజీవి సినిమాలు అంటే ఫైట్ సీన్లు, డ్యాన్స్ సీన్లు ఉంటాయని అభిమానులు ఆశిస్తారు. చిరంజీవి వయస్సు పెరుగుతున్నా అభిమానులను అలరించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. చిరంజీవికి రీఎంట్రీలో మిక్స్డ్ రిజల్ట్స్ ఎదురవుతున్నాయి. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతుంటే మరిన్ని సినిమాలు డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి.

విక్రమ్, జైలర్ తరహా పవర్ ఫుల్ కథలను ఎంచుకుంటే చిరంజీవి కెరీర్ పుంజుకుంటుందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 45 ఏళ్ల సినీ కెరీర్ లో జయాజయాలకు అతీతంగా చిరంజీవి కెరీర్ ను కొనసాగించారు. చిరంజీవికి 2024 సంవత్సరం కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని భారీ బ్లాక్ బస్టర్ హిట్లను మెగాస్టార్ (Chiranjeevi) సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus