మెగాస్టార్ క్రేజ్ బెల్లంకొండకు కలిసొస్తుందా..?

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘సీత’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చేస్తూనే మరో వైపు కోలివుడ్ సూపర్ హిట్ చిత్రం ‘రాచ్చసన్’ రీమేక్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. కోలీవుడ్లో సూపర్ హిట్టయిన ఈ చిత్ర తెలుగు రీమేక్లో బెల్లంకొండ హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం అరవై శాతం షూటింగ్ పూర్తిచేసుకుందట. తెలుగులో ఈ చిత్రానికి చిరంజీవి సూపర్ హిట్ చిత్రం టైటిల్ ను అనుకుంటున్నారట. అదే ‘రాక్షసుడు’. ఈ మధ్య సూర్య కూడా ఈ టైటిల్ ను వాడుకున్నాడు. ఇప్పుడు బెల్లంబాబు సినిమా కోసం కూడా ఇదే టైటిల్ అనుకుంటున్నారట. ఉగాది రోజున ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అలాగే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసే ఛాన్స్ ఉందట. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి జూన్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus