హిందీలో హీరోయిన్ ఛాన్స్ అందుకున్న మేఘ ఆకాష్!

సినీ పరిశ్రమలో ఎప్పుడు కెరీర్ ఊపందుకుంటుందో ఎవరూ ఊహించలేరు. వరుసగా హిట్స్ అందుకున్న వారు సడన్ గా కింద పడిపోతారు. అపజయాలతో సతమవుతున్న వారి కెరీర్ గ్రాఫ్ సడన్ గా పెరిగిపోతుంది. అలా ఉన్నట్టుండి లక్కీ గర్ల్ అయిపోయింది తమిళ బ్యూటీ మేఘ ఆకాష్. గత ఏడాది ఆమె ఎన్నో ఆశలు పెట్టుకొని నటిగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. యువ హీరో నితిన్ తో కలిసి లై సినిమాలో హిరోయిన్‌గా నటించింది. ఇది విజయం సాధించలేదు. మళ్ళీ నితిన్ మేఘా ఆకాష్ ని జోడీగా చేసుకున్నారు. ఛల్ మోహన్ రంగా సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో మేఘ పూర్తిగా అప్ సెట్ అయిపోయింది. అయితే ఆమె కష్టం ఆలస్యంగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ అవకాశం తలుపు తట్టింది.

ఇర్ఫాన్ కమల్‌  “శాటిలైట్‌ శంకర్‌” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు ఆదిత్య పంచోలి హీరోగా నటిస్తున్నారు. అతని సరసన నటించేందుకు మేఘ ఆకాష్ ఎంపికైంది. ఈ విషయాన్ని డైరక్టర్ ఈరోజు వెల్లడించారు. “ఈ చిత్రంలోని పాత్రకు  మేఘా ఆకాశ్‌   సరిపోతుందని భావించాం. ఆమెను సంప్రదించి విషయం చెప్పాము. కథ నచ్చడంతో మేఘ ఓకే చెప్పింది” అని ఇర్ఫాన్ కమల్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం మేఘ ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ మూవీ “ఎనాయ్‌ నోకి పాయుమ్‌ తోట” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతోపాటు రజినీకాంత్‌ ‘పేటా’లో ఓ పాత్ర పోషిస్తోంది. ఇవే కాకుండా రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇలా ఆమె కెరీర్ అమాంతం ఊపందుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus