మెహబూబా కథలో కీలకం ఇదేనంట..!

పునర్జన్మ నేపథ్యంలో అలనాడు కె రాఘవేంద్రరావు జానకి రాముడు తీసి విజయం అందుకున్నారు. అతని శిష్యుడు రాజమౌళి ఇదే నేపథ్యంలో మగధీర తీసి హిట్ కొట్టారు. వారిద్దరికి ఈ నేపథ్యం మంచి విజయాన్ని అందించింది. తాజాగా ఇటువంటి కథని పూరి జగన్నాథ్ డీల్ చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా రీ లాంచ్ చేస్తున్న సినిమా “మెహబూబా’”. తన పుట్టినరోజు సందర్బంగా పూరి ఈ చిత్రాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇదొక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అని ఇదివరకే పూరి చెప్పారు. అయితే ఈ స్టోరీ గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. 1971 ఇండో-పాక్ యుద్ధం అప్పుడు సినిమా మొదలై నేటి కాలంతో సినిమా ముగుస్తుందని సమాచారం. అంటే హీరో హీరోయిన్లు ఇద్దరికీ రెండు జన్మలుంటాయని, గతంలో చనిపోయిన ఇద్దరూ మళ్ళీ ఇప్పుడు పుట్టి కలుస్తారని టాక్.  ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఈ పునర్జన్మ నేపథ్య కథను పూరి ఎలా డీల్ చేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus