Jr NTR: ‘బిల్లా’ సెట్‌కి ఎన్టీఆర్‌ వచ్చి ఏం చేశాడంటే?

ఒక హీరో సినిమా షూటింగ్‌ స్పాట్‌కి మరో హీరో వెళ్లడం అంటే ఆసక్తే కదా. ఇలా గతంలోనూ వెళ్లేవారు, ఇప్పుడూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆ విషయాలు వెంటనే వచ్చేస్తున్నాయి. టీమ్‌లు కూడా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి పెద్ద ప్రచారం చేస్తున్నాయి. కానీ సోషల్‌ మీడియాలో పెద్దగా లేని రోజుల్లో, అస్సలు లేని రోజుల్లో కూడా ఇలాంటివి జరిగేవి. అలా ‘బిల్లా’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ విషయాన్ని దర్శకుడు మెహర్‌ రమేశ్‌ చెప్పారు.

ప్రభాస్‌ ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన సినిమా ‘బిల్లా’. సినిమా ఫలితం, వసూళ్లు పక్కన పెడితే.. ఆ సినిమాలో ప్రభాస్‌ లుక్‌, వాక్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌.. ఇలా అన్నీ అద్భుతం అనే చెప్పాలి. ఆ కటౌట్‌ సూటు బూటు వేసుకుని అలా నడుచుకుంటూ వస్తుంటే ఫ్యాన్సే కాదు.. ప్రేక్షకులు కూడా వావ్‌ అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా దివంగత రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు నిర్మాణంలో తెరకెక్కింది. ఆ నిర్మాణ సంస్థ అంటే భలే సరదాగా ఉంటుంది అని చెబుతుంటారు. అలాంటి సరదాల మధ్యలోకి ఓసారి ఎన్టీఆర్‌ వచ్చాడట.

‘బిల్లా’ సినిమా కోసం కాఠ్‌మాండ్‌లో ఓ పెద్ద సీన్‌ తీస్తున్నారట. ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే మీద ఆ సీన్‌ తీస్తుండగా.. అల్లంత దూరం నుండి ఓ వ్యక్తి సినిమా షూటింగ్‌ వైపు నడుచుకుంటూ వస్తున్నాడట. సినిమా టీమ్‌ మొత్తం ఎంత అరిచి గోల చేస్తున్నా.. పక్కకు జరగడం లేదట ఆ మనిషి. అలా ఎంత చెబుతున్నా వినకుండా.. కెమెరా ముందుకు వచ్చి నిలబడ్డాడట. ఎవరా అని చూస్తే.. ఎన్టీఆర్‌. సినిమా షూటింగ్‌ కోసమని వచ్చి.. టీమ్‌ను కలిశాడట.

ఆ తర్వాత అందరూ కలసి వండుకుని, తిని, మాట్లాడుకుని హ్యాపీగా ఎంజాయ్‌ చేశాం అని చెప్పారు దర్శకుడు మెహర్‌ రమేశ్‌. ఇదంతా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అనుకుంటున్నారా.. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ‘బిల్లా’ సినిమాను రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమంలో ఈ విషయం చెప్పుకొచ్చారు మెహర్‌ రమేశ్‌. అంతకుముందు ఇద్దరూ కలసి ‘కంత్రి’ సినిమా చేసిన విషయం తెలిసిందే.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus