మెహ్రీన్ కి మంచి సినిమాని దూరం చేసిన బరువు

చిన్న చిన్న విషయాలే సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలను దూరం చేస్తుంటాయి. ఆ విషయం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలా కొంచెం బరువున్న కారణంగా మెహ్రీన్ మెగా ఛాన్స్ ని మిస్ చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేచురల్ స్టార్ “కృష్ణగాడి వీర ప్రేమగాథ” తో మెహ్రీన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతో అందరి మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత “మహానుభావుడు” లో మెప్పించింది. రాజా ది గ్రేట్ లో రవితేజ తో కలిసి అదరగొట్టింది. అయితే ఈ జర్నీలో తన రూపం గురించి మెహ్రీన్ పెద్దగా పట్టించుకోలేదు. బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉన్నానని అనుకుంది.

మనకి అనిపించినట్టే ఇతరులకు అనిపించాలనే రూల్ లేదు కదా.. “తొలి ప్రేమ” దర్శకుడు వెంకీ అట్లూరి కి మెహ్రీన్ లావుగా అనిపించింది. అందుకే తన సినిమాలో హీరోయిన్ గా మొదటగా మెహ్రీన్ ని అనుకున్నారు. సంప్రదించారు కూడా. కానీ రోజురోజుకి ఆమె బరువు పెరగడం చూసి.. కథకి చాలా స్లిమ్ గా ఉండాలి కాబట్టి రాశీఖన్నాను సెలక్ట్ చేశారు. నాజూగ్గా , పోష్‌గా కనిపించడంలో రాశీఖన్నా వందమార్కులు కొట్టేసింది. మంచి హిట్ ని తన ఖాతలో వేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మెహ్రీన్ చాలా బాధపడుతోందంట. అందుకే స్లిమ్ అయ్యే పనులు మొదలు పెట్టినట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus