కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మెహ్రీన్ తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరును సంపాదించుకున్నారు. వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థం జరుపుకుని మెహ్రీన్ వార్తల్లో నిలిచారు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ వల్ల మెహ్రీన్ వివాహం వాయిదా పడింది. అయితే తాజాగా మెహ్రీన్ ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకున్నట్టు షాకింగ్ ప్రకటన చేశారు. భవ్య భిష్ణోయ్ , నేను ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని తమ పెళ్లి జరగదని మెహ్రీన్ వెల్లడించారు.
ఈ నిర్ణయం స్నేహపూర్వకంగా తీసుకున్న నిర్ణయమని ఇద్దరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని మెహ్రీన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో భవ్య భిష్ణోయ్, అతని కుటుంబ సభ్యులు, స్నేహితులతో తాను ఎటువంటి సంప్రదింపులు జరపనని ఆమె చెప్పుకొచ్చారు. తాను నిశ్చితార్థం రద్దు గురించి ఇంతకు మించి ఏమీ చెప్పాలని అనుకోవడం లేదని మెహ్రీన్ తెలిపారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని తన నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నానని మెహ్రీన్ అన్నారు.
నటిగా సినిమాలలో కొనసాగుతానని నటన పరంగా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మెహ్రీన్ పేర్కొన్నారు. అయితే మెహ్రీన్ అకస్మాత్తుగా ఎంగేజ్ మెంట్ ను బ్రేక్ చేసుకోవడానికి అసలు కారణం తెలియలేదు. భవిష్యత్తులో మెహ్రీన్ స్పందించి నిశ్చితార్థం రద్దుకు దారితీసిన పరిస్థితులను వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది. మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో పాటు సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!