Mehreen: ఫేక్ ప్రెగ్నెన్సీ వార్తలపై సీరియస్ అయిన మెహరీన్.!

మెహ్రీన్ పిర్జాదాకి (Mehreen Pirzada) ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ పెళ్లి పీటలెక్కలేదు. ఆ నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అయ్యింది.అయితే ఓ ప్రముఖ సంస్థ ఈమెకు పెళ్లి కాకుండానే గర్భం దాల్చినట్టు ప్రకటించింది. దీంతో మెహ్రీన్ కి కోపం వచ్చింది.

అసలేం జరిగింది?

తాజాగా మెహ్రీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘2 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కోసం ప్రిపేర్ అయ్యి మొత్తానికి దాన్ని పూర్తి చేసినట్లు.. అందుకు హ్యాపీగా ఉన్నట్టు’ కూడా ఆమె రాసుకొచ్చింది.ఎగ్ ఫ్రీజింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా ప్రెగ్నెన్సీకి ఇబ్బంది కలగదట. అందుకే కొంతమంది నటీమణులు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అందులో మెహ్రీన్ కూడా చేరింది.

అయితే ఆ వీడియోను ఓ సంస్థ తప్పుగా ప్రచారం చేసింది. దీంతో ఆ సంస్థ షేర్ చేసిన పోస్ట్ పై మెహ్రీన్ స్పందించి.. ‘దయచేసి నిజాలు తెలుసుకుని ప్రచారం చేయండి’ అంటూ రాసుకొచ్చి ఆ సంస్థని ట్యాగ్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ సంస్థ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఏక్ పారేస్తున్నారు. ఇంకొంతమంది అయితే మెహ్రీన్ కి మద్దతు పలుకుతున్నారు. ఇంకొంతమంది ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ రకంగా ఈ టాపిక్ హాట్ టాపిక్ అయ్యింది.

https://twitter.com/Mehreenpirzada/status/1785248999223537821

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus