మెహ్రీన్ పెళ్లి సందడి, వైరలవుతున్న ఫోటోలు

  • March 10, 2021 / 07:22 PM IST

“కృష్ణగాడి వీరప్రేమ గాధ” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. తొలి సినిమాతోనే నటిగా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడికి ఆ తర్వాత ఎందుకో ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. అందుకు కారణాలు చాలా ఉన్నప్పటికీ.. ముఖ్యమైన కారణం మాత్రం అమ్మడు కాస్త బొద్దుగా అవ్వడమే. మొదటి సినిమా హిట్ అయినా అమ్మడికి రెండో అవకాశం అందుకోవడానికి దాదాపు ఏడాది పట్టింది. ఆ తర్వాత చిన్న-పెద్ద తేడా లేకుండా అందరు హీరోలతోనూ జతకట్టేసి ఓ పది సినిమాలు చేసేసింది. హిందీ, తమిళ, పంజాబీ భాషల్లోనూ నటించింది.

అయితే.. అమ్మడికి సరైన బ్రేక్ మాత్రం దొరకలేదు. ఎట్టకేలకు “ఎఫ్ 2”తో కమర్షియల్ హిట్ అందుకుంది. కానీ.. ఆ విజయాన్ని కూడా సరిగా క్యాష్ చేసుకోలేకపోయింది. దాంతో అమ్మడి చేతిలో చెప్పుకోదగ్గ ప్రొజెక్ట్ ఒక్కటి కూడా లేకుండాపోయింది. దాంతో చేసేదేమీ లేక “ఎఫ్ 2”కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “ఎఫ్ 3”లో యాక్ట్ చేస్తూ టైంపాస్ చేస్తోంది మెహరీన్. ఇక టైంవేస్ట్ అనుకుందో లేక ఆఫర్లు రావని ఫిక్స్ అయిపోయిందో తెలియదు కానీ.. యంగ్ ఏజ్ లోనే పెళ్ళికి రెడీ అయిపోయింది.

మెహరీన్ తల్లి పొలిటీషియన్ కావడంతో, పంజాబ్ కి చెందిన లోకల్ పొలిటికల్ లీడర్ తోనే మెహరీన్ పెళ్ళి ఫిక్స్ చేసింది. ఇవాళ మెహరీన్ తనకు కాబోయే భర్తతో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంత త్వరగా ఆమె పెళ్ళి చేసుకోవడం ఆమెకున్న కొద్దిపాటి అభిమానులకు పెద్దగా ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక బెస్ట్ విషెస్ తో సరిపెట్టుకున్నారు. మరి మెహరీన్ పెళ్ళి అనంతరం సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది చూడాలి. పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఆమె ఇక సినిమాల్లో కనిపించడం కష్టమే అనుకోవాలి!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus