జూనియర్ల కంటే సీనియర్లే బెటరంటున్న మెహరీన్!

“కృష్ణగాడి వీరప్రేమగాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్” చిత్రాలతో పాపం హ్యాట్రిక్ హిట్ అందుకొన్నానన్న ఆనందాన్ని ఎంజాయ్ చేసేలోపే “కేరాఫ్ సూర్య”తో ఒక ఫ్లాప్ ను ఖాతాలో వేసుకొన్న మెహరీన్, ఆ ఫ్లాప్ సాగా ను ఎంతమాత్రం కంటిన్యూ చేయకూడదనే ధృడ నిశ్చయంతో ఉంది. అందుకే యంగ్ హీరోలను నమ్ముకొని చిక్కుల్లో పడేకంటే.. మాస్ ఇమేజ్ ఉన్న సీనియర్ హీరోస్ సరసన నటించడం బెటరని భావించి అదే పనిలో ఉంది. అందులో భాగంగానే గోపీచంద్ సరసన కథానాయికగా నటించేందుకు సమ్మతించి అగ్రిమెంట్ సైన్ చేసిందట మెహరీన్. “జై లవకుశ” చిత్రానికి రచయితగా వర్క్ చేసిన చక్రి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న చిత్రంలో కథానాయికగా మెహరీన్ ను ఎంపిక చేశారట. నిజానికి గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదు. బి.గోపాల్ దర్శకత్వంలో నటించిన “ఆరడుగుల బుల్లెట్” విడుదల ఆగిపోగా.. మరో చిత్రం “ఆక్సిజన్” ఎప్పుడు విడుదలవుతుందో అతనికే క్లారిటీ లేని పొజిషన్ లో ఉన్నాడు గోపీ. అయితే.. మెహరీన్ మాత్రం గోపీచంద్ కి ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రొజెక్ట్ సైన్ చేసేసింది.

ఇకపోతే.. మెహరీన్ కథానాయికగా నటించిన మరో చిత్రం “జవాన్” డిసెంబర్ లో విడుదలకానుంది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి బి.వి.ఎస్.రవి దర్శకుడు. సినిమా సంగతి తెలియదు కానీ.. ఈ సినిమాలో అమ్మడు చేసిన ఎక్స్ పోజింగ్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇటీవల విడుదలైన “బుగ్గంచున” సాంగ్ లో సాయిధరమ్ తేజ్ బాబు చాలా జాగ్రత్తతో కూడిన కసితో మెహరీన్ పాపను నలిపేసిన తీరు అందరూ నోళ్లెళ్లబెట్టుకొనేలా చేసింది. చూద్దాం మరి అమ్మడి కెరీర్ గ్రాఫ్ ఎలా ఉండబోతోందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus