Ram Charan: నాన్న మెచ్చుకున్న ఆ క్షణాలను మరిచిపోలేను.. చరణ్ కామెంట్స్ వైరల్!

ఈరోజు స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan)  పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మగధీర (Magadheera) సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ (Game Changer)  మూవీ నుంచి రిలీజైన జరగండి జరగండి సాంగ్ కేవలం 2 గంటల్లోనే 9 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. జరగండి సాంగ్ కు ఇతర భాషల్లో సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చరణ్ బాల్యానికి సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈరోజు రామ్ చరణ్ 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని మంచి డ్యాన్సర్లలో రామ్ చరణ్ ఒకరు కాగా చిన్నప్పుడు చరణ్ డ్యాన్స్ కు దూరంగా ఉండేవారట. యాక్టింగ్ లో మాత్రమే శిక్షణ తీసుకున్న చరణ్ ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే డ్యాన్స్ పై పట్టు సాధించి ప్రశంసలు అందుకున్నారు. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన చరణ్ కు స్పోర్ట్స్ అంటే మాత్రం చాలా ఇష్టమట.

నాలుగో తరగతిలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్న రామ్ చరణ్ బంధువులు, స్నేహితుల పుట్టినరోజు సమయంలో పెంపుడు జంతువులను కానుకగా ఇస్తుంటారు. మాలధారణ వల్ల ప్రశాంతత లభిస్తుందని క్రమశిక్షణ అలవడుతుందని రామ్ చరణ్ పేర్కొన్నారు. కథకు, పాత్రకు తగిన న్యాయం చేశావంటూ ధృవ (Dhruva) మూవీ విషయంలో నాన్న (Chiranjeevi) నన్ను ఎంతగానో మెచ్చుకున్నారని రామ్ చరణ్ తెలిపారు.

రంగస్థలం (Rangasthalam)  మూవీ చూస్తూ అమ్మ ఎమోషనల్ అయ్యారని సినిమా పూర్తైన తర్వాత భారమైన హృదయంతో నన్ను పక్కన కూర్చోవాలని కోరారని ఈ రెండూ నా లైఫ్ లో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు అని చరణ్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు 14 సినిమాల్లో నటించి ఎక్కువ సినిమాలతో విజయాలు అందుకున్న చరణ్ 15వ సినిమా గేమ్ ఛేంజర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అధికారికంగా క్లారిటీ రాలేదు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus