విడుదలకు ముందే “మెంటల్ మదిలో” హల్ చల్!

పనికిమాలిన పంచ్ డైలాగ్స్ విని నవ్వుకోవడానికి మెల్లమెల్లగా అలవాటుపడిపోతున్న ప్రేక్షకులు. పస లేని కథలు, విషయం లేని కథనాలు, క్లారిటీ లేని క్యారెక్టర్లతో అలసిపోయారు. అందుకే మన తెలుగులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకంటే తమిళనాట తెరకెక్కిన ఫీల్ గుడ్ మూవీస్ వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. అప్పుడప్పుడూ వచ్చిన “పెళ్ళిచూపులు, క్షణం” లాంటి సినిమాలు తప్పితే ఈమధ్యకాలంలో సరైన సినిమా రాలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అలా ఒక మంచి చూశామన్న సంతృప్తి లేక ఇబ్బందిపడుతున్న మూవీ లవర్స్ కోసం వచ్చే వారం వస్తున్న చిత్రం “మెంటల్ మదిలో”. “పెళ్లి చూపులు” చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మరో షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ అయిన వివేక్ ఆత్రేయను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు-నివేతా పేతురాజ్ జంటగా నటించారు. నవంబర్ 24న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని కొందరు మీడియా మిత్రులకు, రివ్యూ రైటర్స్ కి స్పెషల్ షో వేశారు. చూసినవాళ్ళందరూ ఒక్కటే మాట చెబుతున్నారు “సినిమా అదిరిపోయింది”. తెలుగులో మంచి సెన్సిబుల్ స్టోరీ వచ్చి చాలా రోజులైంది. ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్స్ చూసి చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు “మెంటల్ మదిలో” సాంత్వన చేకూర్చే సెన్సిబుల్ లవ్ స్టోరీ అని చూసినవాళ్ళందరూ చిత్రాన్ని ఆకాశానికేత్తేస్తున్నారు.

రిలీజ్ కి వారం ముందే బజ్ ఈ రేంజ్ లో ఉండడంతో ఓపెనింగ్స్ మాత్రమే కాక కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదు. అలాగే.. నటుడిగా శ్రీవిష్ణుకి “మెంటల్ మదిలో” ఒక మైలురాయిగా నిలుస్తుంది. అదే విధంగా నివేతా పేతురాజ్ అనే పెర్ఫార్మర్ ఈ చిత్రంలో తెలుగు తెరకు పరిచయమవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus