‘మైత్రీ మూవీ మేకర్స్’ సమర్పణలో ‘క్లాప్ ఎంటర్ టైన్‌మెంట్’ బ్యానర్ పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు కలిసి నిర్మించిన చిత్రం ‘మీటర్’. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి రమేష్ కడూరి దర్శకుడు. అతుల్య రవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల అయ్యింది. మొదటి షోతోనే సినిమా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ‘మైత్రి’ వారే సినిమాని ఓన్ రిలీజ్ చేసుకున్నప్పటికీ..
‘మీటర్’ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.11 cr |
సీడెడ్ | 0.07 cr |
ఉత్తరాంధ్ర | 0.04 cr |
ఈస్ట్ | 0.02 cr |
వెస్ట్ | 0.02 cr |
గుంటూరు | 0.04 cr |
కృష్ణా | 0.05 cr |
నెల్లూరు | 0.02 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.37 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.04 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.41 cr (షేర్ |
‘మీటర్'(Meter) చిత్రాన్ని చాలా వరకు ‘మైత్రి’ సంస్థ వారే ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.41 కోట్ల షేర్ ను రాబట్టింది.
అది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.29 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది పూర్తిగా అసాధ్యమని వీకెండ్ ఓపెనింగ్స్ తో తేలిపోయింది.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!