Meter: ‘మీటర్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

‘మైత్రీ మూవీ మేకర్స్’ సమర్పణలో ‘క్లాప్ ఎంటర్‌ టైన్‌మెంట్’ బ్యానర్ పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు కలిసి నిర్మించిన చిత్రం ‘మీటర్’. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి రమేష్ కడూరి దర్శకుడు. అతుల్య రవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్లు సో సోగా ఉన్నప్పటికీ కిరణ్ అబ్బవరం సినిమా కాబట్టి మినిమమ్ కలెక్షన్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి.

ఇక ‘మీటర్’ (Meter) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 1.23 cr
సీడెడ్ 0.52 cr
ఉత్తరాంధ్ర 0.68 cr
ఈస్ట్ 0.15 cr
వెస్ట్ 0.12 cr
గుంటూరు 0.17 cr
కృష్ణా 0.14 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.11 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.12 cr
ఓవర్సీస్ 0.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.44 cr (షేర్

‘మీటర్’ చిత్రాన్ని చాలా వరకు ‘మైత్రి’ సంస్థ వారే ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కిరణ్ అబ్బవరం గత చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.

అలా చూసుకుంటే ‘మీటర్’ చిత్రం టార్గెట్ ఈజీనే. కానీ పోటీగా రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రం రిలీజ్ అవుతుంది కాబట్టి..’మీటర్’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉంటుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus