మెట్రో

తమిళనాట గతేడాది విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న చిన్న చిత్రాల్లో ఒకటి “మెట్రో”. చైన్ స్నాచింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదించి విడుదల చేశారు. తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్న “మెట్రో” తెలుగువారికి ఏమేరకు నచ్చుతుందో చూద్దాం..!!

కథ : రిటరైన తండ్రి పెన్షన్, కొత్తగా ఉద్యోగంలో చేరిన కొడుకు ఆది (శిరీష్) వచ్చే నెల జీతంతో ఇల్లు గడిపే ఓ ఇల్లాలు.. ఇలా ఒకే ఇంట్లోని వారందరూ దొరికినదాంతో సరిపెట్టుకుందామనే ఆలోచనాధోరణితో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. కానీ.. చిన్నకొడుకు మధు (సత్య) మాత్రం తప్పుడు మార్గంలోనైనా డబ్బు సంపాదించి బండి, కాస్ట్లీ ఫోన్ కొనుక్కోవాలనుకొంటాడు. అందుకు “చైన్ స్నాచింగ్”ను సరైన మార్గంగా ఎంచుకొంటాడు. అప్పటికే చైన్ స్నాచింగ్ బిజినెస్ లో మంచి పలుకుబడి ఉన్న గుణ (బాబీ సింహా) బృందంతో కలిసి నగరంలో చోరీలు మొదలుపెట్టి చేతినిండా డబ్బు సంపాదిస్తుంటాడు.అంతా సజావుగా సాగుతుందనుకొంటున్న సమయంలో తాను చేస్తున్న చైన్ స్నాచింగ్ ల కారణంగా మధు కుటుంబానికే తీరని చేటు జరుగుతుంది. ఏమిటా చేటు, చివరికి మధు జీవితం ఏ తీరానికి చేరింది వంటి ప్రశ్నలకు సమాధానమే “మెట్రో”.

నటీనటుల పనితీరు : నటీనటులందరూ దాదాపుగా కొత్తవారే ఒక్క బాబీ సింహా తప్ప. అయితే.. కొత్త కుర్రాడైన సత్య రెండు విభిన్నమైన షేడ్స్ ను సరికొత్తగా పండించాడు. డ్రగ్ ఎడిక్ట్ గా బాబీ సింహా, తల్లి పాత్రలో తులసి తమ సీనియారిటీని ప్రూవ్ చేసుకోగా.. మెయిన్ లీడ్ గా నటించిన శిరీష్ మాత్రం తేలిపోయాడు. సీరియస్ నెస్, కామెడీ, లవ్ లాంటి అన్ని రకాల ఎమోషన్స్ కి ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్ తో కాస్త ఇబ్బందిపెట్టాడు.

సాంకేతికవర్గం పనితీరు : సినిమాటోగ్రఫీ వర్క్ ఈ చిత్రానికి కీలకమైనది. చైన్ స్నాచింగ్ షాట్స్ ను బాగా తీశారు. అలాగే డిమ్ లైటింగ్ షాట్స్, డ్రోన్ షాట్స్ బాగున్నాయి. జోహన్ పాటలు కాస్త విభిన్నంగా ఉండడం కోసం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ వాడడం కొట్టగానే ఉన్నా వినడానికి మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నేపధ్య సంగీతం మాత్రం ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు, ఎడిటింగ్ కథకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు ఆనంద కృష్ణన్ “చైన్ స్నాచింగ్” అంశానికి మదర్ సెంటిమెంట్ ను జోడించి కథను రాసుకొన్న విధానం, దాన్ని కథనంలో ఎలివేట్ చేసిన విధానం బాగున్నాయి. అయితే.. స్క్రీన్ ప్లేలో కాస్త ల్యాగ్ ఎక్కువయ్యింది. అలాగే.. చాలా లాజిక్స్ మిస్ అయ్యాడు. ఇంట్లో కొడుకు లక్షల విలువైన వస్తువులు వాడుతున్నా ఇంట్లో ఎవరూ పట్టించుకోకపోవడం, కాలేజ్ అటెండన్స్ చెక్ చేయకపోవడం వంటివి వాటిని గాలికొదిలేశారు. అయితే.. మదర్ సెంటిమెంట్ ను బాగా ఎలివేట్ చేయడంతో మిగతావన్నీ ప్రేక్షకుల బుర్ర వరకూ చేరే అవకాశాలు తక్కువ.

విశ్లేషణ : “చైన్ స్నాచింగ్” నేపధ్యంలో సెంటిమెంట్ ను మేళవించి తెరకెక్కించిన చిత్రం “మెట్రో”. డబ్బింగ్ వర్క్ కాస్త గజిబిజిగా ఉన్నా.. కథ-కథనాల్లో ఉన్న ఇంటెన్సిటీ కారణంగా ఆడియన్స్ సినిమాలో లీనమైపోతారు. టైమ్ పాస్ కోసం చూడదగ్గ చిత్రమిది.

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus