విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన యూత్-ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మధుర శ్రీధర్ రెడ్డి,ఎన్.హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇదివరకే విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కాబోతోంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ డోస్ పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో ఈరోజు ట్రైలర్ ను కూడా విడుదల చేసింది.’సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 34 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘వాని కథ నువ్వు చెప్తావా’ అంటూ తరుణ్ భాస్కర్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ వెంటనే ‘దేవర కథ ప్రకాష్ రాజ్ చెబితే వినలేదా?’ అంటూ కమెడియన్ అభినవ్ గోమఠం వేసిన పంచ్ గట్టిగా వైరల్ అయ్యేలా ఉంది.
ఆ వెంటనే ‘వినే యాంకర్ ఉంటే వేణుస్వామి ఇంత చెప్పాడు’ అంటూ మరో పంచ్ పేల్చాడు అభినవ్ గోమఠం. అటు తర్వాత వెన్నెల కిషోర్ పాత్ర కూడా ఎంట్రీ ఇచ్చి పంచ్ డైలాగులు విసరడం వంటివి చూస్తుంటే.. సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం లోటు ఉండదు అని అర్ధమవుతుంది. అలాగే ప్రెజెంట్ జెనరేషన్లో యూత్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ని దర్శకుడు సంజీవ్ రెడ్డి చాలా సెన్సిబుల్ గా డీల్ చేసినట్టు స్పష్టమవుతుంది.
ఎమోషన్ కి కూడా పెద్ద పీట వేశారు. చాందినీ చౌదరి గ్లామర్, సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ట్రైలర్ కి అదనపు ఆకర్షణలు అని చెప్పొచ్చు. అలాగే ట్రైలర్ కట్ చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది.సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. అందుకు ఎడిటర్ సాయికృష్ణ గనాలకి కూడా ఫుల్ మర్క్స్ వేసేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :