సందీప్ కిషన్ హీరోగా రూపొందిన తొలి పాన్ ఇండియా చిత్రం ’మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి’ ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’ బ్యానర్లపై భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మైఖేల్ టీజర్, ట్రైలర్లకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.దీంతో ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 1.00 cr |
సీడెడ్ | 0.56 cr |
ఆంధ్ర | 1.45 cr |
ఏపి+ తెలంగాణ | 3.01 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.14 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 3.15 cr |
‘మైఖేల్’ చిత్రానికి రూ.3.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.4 కోట్లు షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ కనుక వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కష్టమే. సందీప్ కిషన్ గత చిత్రాలు బాగానే ఆడాయి కానీ బ్రేక్ ఈవెన్ కు అడుగు దూరంలో ఆగిపోయాయి. మరి ఈ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందేమో చూడాలి.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?