ఏడాదికి అయిదారు సినిమాలు చేయాలన్న కంగారు నాకు లేదు : మిక్కీ జె.మేయర్

  • July 8, 2020 / 12:04 PM IST

పుట్టింది సికింద్రాబాద్ లోనే అయినప్పటికీ.. పెరిగింది, ప్రస్తుతం నివాసిస్తోంది కూడా అమెరికాలో అవ్వడం వలన తెలుగు చదవడం, రాయడం మాత్రమే కాదు అర్ధం చేసుకోవడం కూడా సరిగా రాకపోయినప్పటికీ.. స్వచ్చమైన తెలుగు పాటలకు సంగీతాన్ని సమకూరుస్తూ సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు మిక్కీ జె.మేయర్. ఆయన సంగీత సారధ్యం వహించిన తాజా చిత్రం “మహానటి”. ఇవాళ సాయంత్రం ఆడియో విడుదల వేడుక నిర్వహించబడనున్న ఈ చిత్రానికి పని చేయడం, మ్యూజిక్ డైరెక్టర్ గా ఈమధ్యకాలంలో సరైన హిట్ లేకపోవడం, వరుస చిత్రాల ఆఫర్లు రాకపోవడం పట్ల మిక్కీ మీడియా మిత్రులతో పంచుకొన్న విశేషాలు..!!

ఆడియన్స్ ఆ తప్పుని గుర్తుపెట్టుకొంటారనుకోవడం లేదు.. “మహానటి” ఫస్ట్ లుక్ టీజర్ ను టైటిల్ తో ఎనౌన్స్ చేసినప్పుడు యూజ్ చేసిన బ్యాగ్రౌండ్ కి విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏదో కొత్తగా ఉండచ్చేమోనని “మహానటి” టైటిల్ టీజర్ కోసం రాక్ మ్యూజిక్ యూజ్ చేశామే కానీ సినిమానో లేక సినిమాలోని కంటెంట్ నో హేళన చేయాలనే ఆలోచన మాకు లేదు. అదే విధంగా “మహానటి” అనే పదాన్ని సరిగా ఉచ్చరించడం తెలియక ఆ పొరపాటు జరిగింది. ట్రైలర్ లో తప్పులను రిపీట్ చేయకుండా జాగ్రత్తపడ్డాం.

ఏడాది కష్టమిది.. దాదాపు సంవత్సరన్నరపాటు “మహానటి” మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం కష్టపడ్డాం. సావిత్రిగారి సినిమాలన్నీ చూశాను, ఆవిడ నటించిన సినిమాల్లోని హిట్ సాంగ్స్ ను ప్రత్యేకంగా పదుల సంఖ్యలో విన్నాను. ఇవి మాత్రమే కాకుండా సావిత్రిగారి గురించి చాలా విషయాలు తెలుసుకొన్నాను. సినిమా చూస్తున్నప్పుడు నా సంగీతం సినిమాలోని ఎమోషన్, ఫీల్ ను ఎలివేట్ చేయాలనుకొన్నాను. అందుకే ఇప్పటివరకూ ఏ సినిమా కోసం పడనంత కష్టం ఈ సినిమా కోసం పడ్డాను.

రఘు సౌండ్ డిజైనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.. పీరియాడిక్ ఫిలిమ్ కావడంతో “మహానటి”కి మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ కంటే ఎక్కువగా సౌండ్ డిజైనింగ్ కి స్కోప్ ఉంటుంది. రఘు అనే సౌండ్ ఇంజనీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతని సౌండ్ డిజైనింగ్ వల్ల సినిమా చూసే ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ సినిమాటైక్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది.

అశ్విన్ నాకు “లీడర్” నుంచి తెలుసు.. నేను లీడర్ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడే నాగఅశ్విన్ తో పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచి తన డెడికేషన్ గురించి తెలుసు. తను “మహానటి” కథ రాసుకొంటున్నప్పుడే నాకు చెప్పాడు. అప్పట్నుంచి అందరం ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అందుకే సినిమాకి ఎలాంటి మ్యూజిక్ వర్కవుట్ అవుతుంది, ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి అనే విషయంలో ముందు నుంచీ క్లారిటీ ఉంది.

రీరికార్డింగ్ కంప్లీట్ అయ్యింది.. నిన్నటితో సినిమా రీరికార్డింగ్ పూర్తయ్యింది. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. సినిమా రిలీజ్ కి ముందు ఎలాంటి టెన్షన్స్ లేకుండా అన్నీ ముందే కంప్లీట్ చేస్తున్నాం. మే 4 కల్లా ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో, మే 9న “మహానటి” షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేయడం తప్ప వేరే విషయాలేమీ మా మైండ్ లో ఉండవు.

నాకు అలాంటి అసంతృప్తి లేదు.. ఏడాదికి అయిదారు సినిమాలు చేసేయాలి, బిజీగా లైఫ్ స్పెండ్ చేయాలి అనే ఆలోచన నాకెప్పుడూ లేదు. అందుకే నాకు నచ్చిన సినిమాలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను తప్పితే ఎక్కువ సినిమాలు చేసేయాలన్న తపన నాకు లేదు. నాకంటూ ఒక లైఫ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం కూడా నాకు ముఖ్యమే. ఒక ఫోక్ ఆల్బమ్ చేయాలన్న ఆశ మాత్రం ఉంది. త్వరలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను.

మరో మూడు సినిమాలు చేస్తున్నాను.. “మహానటి” కాకుండా ప్రస్తుతం “శ్రీనివాస కళ్యాణం”, ప్రవీణ్ సత్తారు-రామ్ సినిమా మరియు మహేష్ బాబు నెఫ్యూని హీరోగా లాంచ్ చేస్తున్న సినిమాకి కూడా సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ఈ మూడు అయిన తర్వాత మళ్ళీ వేరే స్క్రిప్త్స్ నచ్చితే అప్పుడు మిగతా సినిమాలు అంగీకరిస్తాను.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus