రియల్ హీరోగా సోనూసూద్ అభిమానుల హృదయాల్లో భారీస్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది కష్టాల్లో ఉన్నవారికి సరైన సమయంలో వైద్య సేవలు అందేలా సోనూసూద్ కృషి చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ రైడ్స్ జరిగాయి. ఈ రైడ్స్ వల్ల సోనూసూద్ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా మాట్లాడుతూ బాలీవుడ్ నటుడిగా సోనూసూద్ తనకు ముందే పరిచయమని అన్నారు.
కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాల ద్వారా యావత్ ప్రపంచానికి సోనూసూద్ హీరో అయ్యాడని కేటీఆర్ పేర్కొన్నారు. సోనూసూద్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్లు వ్యక్తం కాగా పాలిటిక్స్ పై సోనూసూద్ కు ఆసక్తి లేదని కేటీఆర్ వెల్లడించారు. సోనూసూద్ పాలిటిక్స్ లోకి వస్తాడనే అతని గురించి దుష్ప్రచారం చేశారని కేటీఆర్ అన్నారు. సోనూసూద్ మంచి మనిషి అని అతని వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం జరిగిందని కేటీఆర్ తెలిపారు. సోనూసూద్ ఇలాంటి వాటికి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
సోనూసూద్ కు తాము అండగా ఉంటామని ఇలాంటి వాటికి సోనూసూద్ ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ కామెంట్లు చేశారు. కరోనా కష్ట కాలంలో సోనూసూద్ సేవా భావాన్ని చాటుకున్నారని కేటీఆర్ వెల్లడించారు. సేవా కార్యక్రమాల ద్వారా సోనూసూద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ కామెంట్లతో సోనూసూద్ పై నిజంగానే కుట్ర జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.