పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమా విషయంలో కక్షపూరితంగా వ్యవహరించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం గురించి మంత్రి పేర్ని నాని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేసుకున్న వాళ్లు సినిమాను కొత్త జీవో వచ్చే వరకు వాయిదా వేసుకోలేకపోయారా? అని పేర్ని నాని ప్రశ్నించారు.
24వ తేదీనాటికి జీవో రావాలని అయితే మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడంతో జీవో ఆలస్యమైందని ఆయన అన్నారు. మంత్రి చనిపోయిన బాధలో మేముంటే చంద్రబాబు అందులో కూడా రాజకీయాలు వెదుక్కుంటున్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. లోకేష్ భీమ్లా నాయక్ గురించి సోషల్ మీడియాలో వేస్తున్న ట్వీట్లను చూస్తుంటే వాళ్ల కపట ప్రేమ అర్థమవుతోందని ఎన్టీఆర్ మూవీకి ఎప్పుడైనా ఇలా ట్వీట్లు వేశారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇండస్ట్రీకి మంచి చేస్తామని చెప్పారని కచ్చితంగా చేస్తారని పేర్ని నాని చెప్పుకొచ్చారు.
కమిటీ నిర్ణయాల ప్రకారం త్వరలో జీవో ఇస్తామని పేర్ని నాని వెల్లడించారు. ఎక్కువ రేట్లతో ప్రజలను దోచుకుంటామంటే ప్రభుత్వం నియంత్రించకుండా ఉండాలా? అని పేర్ని నాని ప్రశ్నించారు. మూడు నాలుగు రోజుల్లో జీవో వస్తుందని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చూసి గతిలేక సమావేశానికి వచ్చానని పేర్ని నాని వెల్లడించారు. మంత్రి చనిపోయి మేము బాధలో ఉన్నామనే విషయాన్ని కూడా గమనించలేరా అని మంత్రి కామెంట్లు చేశారు.
బాధలో ఉండటం వల్లే ఏం మాట్లాడినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు. పవన్ సినిమాను ఫ్రీగా చూపిస్తామని చెప్పారని అలాంటప్పుడు బ్లాక్ లో టికెట్లను విక్రయించాల్సిన అవసరం ఏముందని ఆయన అన్నారు. పవన్ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు లోకేశ్ చెప్పారని మరి ఎన్టీఆర్ మూవీకి చెప్పారా అని మంత్రి ప్రశ్నించారు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!