‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!

 చేసిన మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ‘రారా రెడ్డి’ పాట చార్ట్ బస్టర్ అయ్యింది. ట్రైలర్ కూడా బాగుంది. ఇవి సరిపోవా.. ‘మాచర్ల నియోజకవర్గం’ పై అంచనాలు పెరగడానికి..! అందుకే ఈ సినిమా పై కూడా అంచనాలు పెరిగాయి.అయితే ఈరోజు(ఆగస్టు 12 న) విడుదలైన ఈ మూవీకి నెగిటివ్ టాక్ వస్తుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ముందుగా కథ. సినిమా చూసిన రెండు, మూడు సీన్లకే.. ఓ ఐడియా వచ్చేస్తుంది. లక్ష్మీ లో బ్రహ్మి ‘ఏదో తేడాగా ఉందేంటి’ అన్నట్టు. అలాగే ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఈ కథని నితిన్ ఎలా ఓకే చేశాడు అనే ప్రశ్న ఎంత కంట్రోల్ చేసుకున్నా వచ్చేస్తుంది. ఇలాంటి కథ గతంలో చాలా సినిమాల్లో చూశాం. సుకుమార్- రాంచరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ కూడా ఇలాంటి కథతోనే తెరకెక్కింది. బహుశా హీరోకి ఎక్కువ ఎలివేషన్ సీన్లు రాసుకుని నితిన్ కూడా దర్శకుడు వినిపించడం వలన ఓకె చేసి ఉండొచ్చు.

2) ఎంత రొటీన్ కథ అయినా.. సీన్లు కొత్తగా రాసుకుని ఎలివేషన్ సీన్లు బాగా రాసుకుంటే జనాలకు ఎక్కే అవకాశం లేకపోలేదు. కానీ దర్శకుడు అలాంటిది ఏమీ చేయలేదు. నితిన్ ‘ఆటాడిస్తా’ చిత్రం టైపు స్క్రీన్ ప్లే తో లాగించేసాడు.

3) చెప్పుకోడానికి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు కేథరిన్. మరొకరు కృతి శెట్టి. కేథరిన్ ను దర్శకుడు తొడలు చూపించడం వరకే ఉపయోగించుకున్నాడు. కొంచెం డీప్ గా వెళ్తే ఆమె హీరోని విలన్ ఉండే ఊరుకి పంపించడం వరకు పనికొచ్చింది. లుక్స్ పరంగా అయితే ఆమె నితిన్ కి అక్కలా కనిపించింది. ఇక కృతి శెట్టి పాత్ర ఫస్ట్ హాఫ్ లో లాయర్లను, పోలీస్ కమిషనర్లను కలుస్తూ ఉంటే ఆమె పాత్రలో ఏదో ఎమోషన్ దాగి ఉందేమో అనుకుంటాం. కానీ ఇంటర్వెల్ కే దానిని తుస్సుమనించాడు దర్శకుడు. ఈ సినిమాలో ఆమె లుక్స్ కూడా ఆకర్షించేలా లేవు.

4) మాస్ సినిమాలకు కచ్చితంగా కావాల్సింది మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ‘భీష్మ’ కి మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన మహతి.. ఎందుకో ఈ సినిమాకి సరైన నేపధ్య సంగీతం అందించలేకపోయాడు. అధిక భాగం ట్రైలర్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే నడిపించేశాడు.

5) ఈ చిత్రంలో కామెడీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా వెన్నెల కిశోర్ చేసిన ఇగో ట్రాక్ కామెడీ చాలా విసిగిస్తుంది. వెన్నెల కిశోర్ చేశాడు కాబట్టి మాత్రమే.. జనాలు ఓపిగ్గా ఎక్కడో చోట పికప్ అవుతుందేమో అని ఎదురుచూస్తుంటారు. కానీ వారి ఓపికకి పాజిటివ్ రిజల్ట్ అయితే దక్కదు.

6)రాజేంద్ర ప్రసాద్ – మురళీ శర్మ పాత్రలు .. కమెడియన్స్ గా కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా కాకుండా ఉన్నాయి.

7) నితిన్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ అతని కాస్ట్యూమ్స్ మాత్రం ‘భీష్మ’ లో వాడినవేనేమో అని డౌట్ వచ్చేలా ఉంటాయి. హీరోయిన్లకు కూడా సరైన కాస్ట్యూమ్స్ అందించలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది.

8) ఈ చిత్రంలో సముద్ర ఖని ఎందుకు డ్యూయల్ రోల్ చేశాడో అర్థం కాదు. చివర్లో ‘ఎలక్షన్స్ లో పోటీకి నిలబడ్డ వ్యక్తిని కొట్టకూడదు, చంపకూడదు .. అలా చేస్తే ఎలక్షన్స్ ఆగిపోతాయి అని నితిన్ ఓ డైలాగ్ చెప్పి రెండో సముద్రఖనిని చితక్కొడతాడు. అందుకోసమే సముద్ర ఖని ని డ్యూయల్ చేసినట్టు ఉంది.

9)డైలాగ్స్ ఏమాత్రం గుర్తుపెట్టుకునేలా లేవు. నితిన్ చాలా చోట్ల ఫాస్ట్ గా డైలాగులు చెప్పాడు కానీ.. అవి పెద్దగా ఇంపాక్ట్ చూపించవు.నితిన్ ఆ డైలాగ్స్ ఫాస్ట్ గా చెప్పడం మాత్రమే స్పెషల్ గా చెప్పుకోవాలి.

10) ఎడిటింగ్ కూడా పెద్ద మైనస్ గా మారింది. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus