Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

తేజ సజ్జ హీరోగా మంచి ఫామ్లో ఉన్నాడు. ‘జాంబీ రెడ్డి’ తో సూపర్ హిట్ కొట్టాడు. ‘హనుమాన్’ తో అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత తేజ సజ్జకి వరుస ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ అతను తన ఫుల్ ఫోకస్ ‘మిరాయ్’ అనే సినిమాపై పెట్టి.. దాన్ని పూర్తి చేశాడు. ఇది కూడా మైథలాజికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ అనే చెప్పాలి.

Mirai Trailer Review

గ్లింప్స్, టీజర్, వైబ్ ఉంది బేబీ వంటి పాటలు సినిమాపై మంచి అంచనాలు సృష్టించాయి. పాన్ ఇండియా లెవెల్లోనే ఈ సినిమా కూడా విడుదల కానుంది. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. తాజాగా ట్రైలర్ ని వదిలారు. దాదాపు 3 నిమిషాల నిడివి కలిగి ఉంది ట్రైలర్. అశోకుడి 9 పుస్తకాలు.. వాటిని దక్కించుకునే ప్రయత్నం చేసి ప్రపంచాన్ని తన కాళ్ళ వద్ద పడుండేలా చేయాలనే విలన్(మంచు మనోజ్).. దాన్ని ఆపడానికి హీరోని ఏర్పరుచుకున్న దైవం, అతనికి బలంగా ఏర్పాటు చేసిన ఆయుధం.. అదే ‘మిరాయ్’ అని ట్రైలర్ తో స్పష్టం చేశారు.

ఆడియన్స్ ని కథలోకి తీసుకెళ్లేందుకు ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ చివర్లో శ్రీరాముడు ఎంట్రీ కూడా గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని చెప్పాలి. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. తేజ సజ్జ ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడటం గ్యారెంటీ అనే నమ్మకాన్ని కూడా కల్పించింది. మీరు కూడా ఓ లుక్కేయండి

బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus