Mirchi Collections: ‘మిర్చి’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • February 8, 2023 / 12:23 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గా ఎదగడానికి  కారణమైన సినిమాల్లో ‘మిర్చి’ ఒకటి. ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఫుల్ ఫామ్లో ఉన్న ప్రభాస్ కు ‘రెబల్’ చిత్రం పెద్ద దెబ్బ కొట్టింది. ‘బాహుబలి’ వరకు ప్రభాస్ కు హిట్లు పడటం కష్టమే అంటూ అంతా కామెంట్లు చేసిన రోజులవి. అయితే ‘రెబల్’ విడుదలైన 4 నెలలకి  ‘మిర్చి’ విడుదలయ్యి ఆ కామెంట్లకి ఫుల్ స్టాప్ పడేలా చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్స్, స్టైల్, యాక్టింగ్ యాంటీ ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

2013 వ సంవత్సరం ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలైంది.ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.నేటితో ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ‘మిర్చి’ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 15.11 cr
సీడెడ్   7.51  cr
ఉత్తరాంధ్ర   4.20 cr
ఈస్ట్   2.90 cr
వెస్ట్   2.65 cr
గుంటూరు   3.71 cr
కృష్ణా   2.75 cr
నెల్లూరు   1.67 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   4.30 Cr
మలయాళం+తమిళ్   0.18 Cr
ఓవర్సీస్   2.90 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 47.88 cr

‘మిర్చి’ చిత్రానికి రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.47.70 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకి ఈ చిత్రం రూ.17.88 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ కెరీర్లో అప్పటి వరకు అత్యథిక కలెక్షన్లను నమోదు చేసిన చిత్రమిదే. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో విడుదలైనప్పటికీ ఈ చిత్రం అంత కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు.

‘బాహుబలి’ తర్వాత ‘మిర్చి’ ని తమిళ్, మలయాళం భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయగా అక్కడ కూడా పర్వాలేదనిపించింది ‘మిర్చి’. సంక్రాంతి సీజన్ కు కనుక ఈ చిత్రం విడుదలయ్యి ఉంటే మరింతగా  కలెక్ట్ చేసి ఉండేది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus