ఆకట్టుకుంటున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్..!

సౌత్ లో కొన్నాళ్ళపాటు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను అనుభవించిన అనుష్క శెట్టి ఈ మధ్య కాలంలో సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. 2020 లో వచ్చిన ‘నిశ్శబ్దం’ తర్వాత ఆమె నుండి మరో సినిమా రాలేదు.సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చింది అనుష్క. ప్రస్తుతం ఆమె యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా చేస్తుంది. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి స్పందన లభించింది. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి పి. మహేష్ కుమార్ దర్శకుడు. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ టీజర్ ఒక నిమిషం 2 సెకన్ల నిడివి కలిగుంది. ఒక చెఫ్, ఒక స్టాండప్ కమెడియన్ ల మధ్య సాగే రొమాంటిక్ కథ ఇదని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. దీనికి ఎంటర్టైన్మెంట్ ను కూడా గట్టిగానే దట్టించారు.అన్విత రవళి శెట్టి అనే చెఫ్ పాత్రలో నటించిన అనుష్క కనిపిస్తుంది. ఆమెకు పెళ్లంటే ఇష్టం ఉండదు. దానికి ఆమె తల్లి( జయసుధ) సపోర్ట్ కూడా ఉంటుంది. మరోపక్క పేరెంట్స్ కి వ్యతిరేకంగా స్టాండప్ కమెడియన్ అవ్వాలనుకునే కుర్రాడు సిద్దు(నవీన్ పోలిశెట్టి).

వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం… తర్వాత స్నేహంగా ఎలా మారింది? ప్రేమ, పెళ్లి వరకు చేరుకుందా లేదా అన్నది మిగిలిన కథ. ఈ టీజర్ లో అనుష్క కంటే ఎక్కువగా నవీన్ పోలిశెట్టి హైలెట్ అయ్యాడు అని చెప్పొచ్చు.అతని కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ‘అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటా’ .. ‘సిట్యుయేషన్ కు సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటా’ అంటూ తన మార్క్ కామెడీ పండించాడు. హీరోయిన్ అనుష్క మళ్ళీ బొద్దుగా కనిపించి.. తన అభిమానులను కొంత డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇక టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus