Kantara Chapter 1: పేరుకి రూ.600 కోట్ల సినిమా… కానీ ఇదేం లాజిక్ బాబూ!

Advertisement

కన్నడ సెన్సేషన్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తోందో తెలిసిందే. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, నటించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఇంత పర్ఫెక్ట్‌గా తీసిన సినిమాలో ఓ చిన్న తప్పును నెటిజన్లు కనిపెట్టారు. ఇప్పుడదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.2022లో వచ్చిన ‘కాంతార’ కథ వర్తమానంలో జరుగుతుంది. కానీ, ‘కాంతార: చాప్టర్ 1’ కథ మాత్రం 16వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. దీంతో ఆ కాలానికి తగ్గట్టుగా సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ విషయంలో డైరెక్టర్ రిషబ్ శెట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే, ఒకే ఒక్క సీన్‌లో చిత్రయూనిట్ అడ్డంగా దొరికిపోయింది.

Kantara Chapter 1

రీసెంట్‌గా మేకర్స్ రిలీజ్ చేసిన ‘బ్రహ్మకలశం’ ఫుల్ వీడియో సాంగ్‌లో ఈ మిస్టేక్ బయటపడింది. ఈ పాటలో గూడెం ప్రజలంతా కలిసి సామూహిక భోజనాలు చేసే సీన్ ఒకటి ఉంది. అక్కడే, ఆ సీన్‌కు ఏమాత్రం సంబంధం లేని ఓ 20 లీటర్ల ప్లాస్టిక్ వాటర్ క్యాన్ కెమెరా కంటపడింది. బహుశా, షూటింగ్ సమయంలో దాన్ని పక్కకు తీయడం మర్చిపోయి ఉంటారు.

ఈ సాంగ్ వీడియోలో సరిగ్గా 3 నిమిషాల 6 సెకన్ల దగ్గర మీరు కూడా ఈ తప్పును స్పష్టంగా చూడొచ్చు.ఈ చిన్న పొరపాటును పసిగట్టిన నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో స్క్రీన్‌ షాట్లు తీసి వైరల్ చేస్తున్నారు. ‘16వ శతాబ్దంలోనే ప్లాస్టిక్ వాటర్ క్యాన్లు వచ్చేశాయా రిషబ్ అన్నా?’ అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే, ఈ ఒక్క చిన్న మిస్టేక్ మినహా సినిమా అద్భుతంగా ఉందని, ఇలాంటివి పెద్ద ప్రాజెక్టులలో సహజమేనని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.

 బామ్మర్ది పెళ్లికి ఎన్టీఆర్ కాస్ట్ లీ గిఫ్ట్.. తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus