Jr NTR: బామ్మర్ది పెళ్లికి ఎన్టీఆర్ కాస్ట్ లీ గిఫ్ట్.. తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఆయన బామ్మర్ది, యంగ్ హీరో నార్నే నితిన్ పెళ్లి అక్టోబర్ 10న హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో చాలా గ్రాండ్‌గా జరిగింది. గతేడాది నవంబర్‌..లో శివానీతో నిశ్చితార్థం జరుపుకున్న నితిన్, ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేశాడు. ఈ వెడ్డింగ్ ఈవెంట్‌..కు టాలీవుడ్‌లోని ప్రముఖులంతా క్యూ కట్టారు.ఈ పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌..గా నిలిచారు. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన బామ్మర్దికి అంటే హీరో నార్నే నితిన్ కు …ఎన్టీఆర్ ఓ అదిరిపోయే పెళ్లి కానుక ఇచ్చాడట. అదేంటో తెలుసా?

Jr NTR

కొత్త జంట నార్నే నితిన్-శివానీలకు ఓ బ్రాండ్ న్యూ లగ్జరీ కారును గిఫ్ట్‌గా ప్లాన్ చేశాడని టాక్ నడుస్తోంది. దాని కాస్ట్ వింటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. దీనిపై అధికారికంగా క్లారిటీ లేకపోయినా, ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకోవడమే కాకుండా, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇవ్వడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇస్తాడో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ పెళ్లి వేడుకకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వెంకటేష్, రానా, సురేశ్ బాబు, రాజీవ్ కనకాల వంటి ఎందరో సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ చేసిన అల్లరి వేడుకకే హైలైట్‌గా నిలిచింది.

ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కొడుకైన నార్నే నితిన్, ‘మ్యాడ్’ సినిమాతో హీరోగా మంచి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ‘ఆయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ విషయానికొస్తే, ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే భారీ యాక్షన్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

‘కె ర్యాంప్‌’.. ఇంచుమించు రియల్‌ స్టోరీనట.. ఆ మాటలపైనా క్లారిటీ

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus