Mahesh Babu: రిలీజైనప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు ఏకి పారేస్తున్నారు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ మూవీ మే 12న విడుదలై మొదటి రోజు ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో మూవీగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.112 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.’మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై మహేష్ బాబు సహా నిర్మాతగా వ్యవహరించాడు.

సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కడం వలన ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం టేకింగ్ విషయంలో దర్శకుడు పరశురామ్ చాలా తప్పులు చేశాడు. ఓ సందర్భంలో వాటిని కవర్ చేసుకున్నాడు కూడా..! కానీ.. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఓ బ్లండర్ మిస్టేక్ ను నెటిజన్లు కనిపెట్టి అతన్ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అదేంటి అంటే.. సినిమా సెకండ్ హాఫ్ లో ఢిల్లీ నేపథ్యంలో ఓ సీన్ ఉంటుంది.

నదియా పాత్ర జైల్లో ఉన్నప్పుడు కలుసుకోవడానికి వెళ్లిన మహేష్.. అక్కడికి విలన్ సముద్రఖని ని కూడా రమ్మని పిలుస్తాడు. వచ్చేప్పుడు పళ్ళు తీసుకురమ్మంటాడు. విలన్ మహేష్ అడిగిన పళ్ళు తీసుకొచ్చినప్పుడు వాటిని తీసుకోమని జైల్లో ఉన్న నదియాకి చెబుతాడు. కానీ ఆమె తీసుకోకుండా వెళ్ళిపోతుంది. ఎమోషనల్ గా ఫీలయ్యి ఆమె వెళ్ళిపోయింది అని థియేటర్లో చూసినప్పుడు జనాలు అలా ఫిక్స్ అయ్యారు.కానీ ఓటీటీలో చూసాక నిజంగా ఆమె ఆ పళ్ళు తీసుకోవాలనుకున్నా అక్కడ స్పేస్ ఉండదు.

దీంతో ‘మర్యాద రామన్న’ సినిమాలో సునీల్ ట్రైన్ లో ఉండి కొబ్బరి బోండం తీసుకోవడానికి కష్టపడే సన్నివేశాన్ని గుర్తుచేస్తూ.. దర్శకుడు పరశురామ్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే దర్శకుడు థియేటర్స్ లో ఆడియన్స్ రియాక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆ సీన్ ను అలా తీసినట్టు ఉన్నాడు. ఆ రకంగా అయితే అతను సక్సెస్ అయినట్టే. ఎందుకంటే థియేటర్లో చూసినప్పుడు ఏ ప్రేక్షకుడు కూడా ఈ సన్నివేశం గురించి కంప్లైంట్ చేయలేదు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus