Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

ఈ వారం ‘శివ’ సినిమా రీ- రిలీజ్ కాబోతుంది. చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ ఈరోజు రిలీజ్ కావడం లేదు కాబట్టి.. కచ్చితంగా ఈ వీకెండ్ కి ‘శివ’ మేనియా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అక్కినేని నాగార్జున కూడా ఈ రీ- రిలీజ్ ని ప్రత్యేకంగా నిలపాలని ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. 1990 డిసెంబర్ 7న వచ్చిన ‘శివ’ అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పటి వరకు ఒక రెగ్యులర్ పంధాలో వస్తున్న కమర్షియల్ సినిమాలకి ‘శివ’ బ్రేకులు వేసింది అనే చెప్పాలి.

Shiva

డెబ్యూ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు. కానీ మొదటి రోజు సినిమా చూసిన ప్రేక్షకులు మ్యాడ్ అయిపోయారు అనే చెప్పాలి. ఈవెనింగ్ షోలకి టికెట్లు సేల్ అయిపోయి హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. తర్వాత ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నాగార్జున కెరీర్ గురించి చెప్పాలంటే ‘శివ’కి ముందు.. ‘శివ’ తర్వాత అని చెప్పుకునేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. ‘శివ’ సినిమాలో నాగార్జునకి అన్న పాత్రలో మురళీ మోహన్ నటించారు. అతని కూతురిగా ఓ చిన్న పాప నటించింది. నాగార్జునని బాబాయ్..బాబాయ్ అంటూ క్యూట్ గా కనిపించే పాత్రలో క్యూట్ గా నటించింది. క్లైమాక్స్ లో ఈ పాప చనిపోవడంతో హీరో వెళ్లి విలన్ ని చంపి పగతీర్చుకోవడంతో సినిమాకి శుభం కార్డు పడుతుంది. అయితే ఈ పాత్ర చేసిన ఆ పాప ఇప్పుడు చాలా అందంగా మారింది.

ఆమె అసలు పేరు సుష్మ అని రాంగోపాల్ వర్మ తెలిపాడు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. నాగార్జునతో కలిసి ‘శివ’ సినిమాలో సైకిల్ ఫైట్ సీక్వెన్స్ లో ఈ పాప పాల్గొంది. ఆమె లేటెస్ట్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రస్తుతం అమెరికాలో AI & కాగ్నిటివ్ సైన్స్ లో రీసెర్చ్ చేస్తుందట.

‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus