ప్రియదర్శి హీరోగా నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘మిత్రమండలి’. ప్రసాద్ బెహరా, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ వంటి వారు కీలక పాత్రలు పోషించగా కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే వీటీవీ గణేష్, దర్శకుడు అనుదీప్ కేవీ వంటి వాళ్ళు కూడా స్పెషల్ రోల్స్ చేయడం గమనార్హం.
బన్నీ వాస్ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 16న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ వాస్ బ్రాండ్, మంచి క్యాస్టింగ్ ఉండటంతో ‘మిత్రమండలి’ కి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 1.5 cr |
సీడెడ్ | 0.50 cr |
ఆంధ్ర(టోటల్) | 2 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 4 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 1.5 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.5 cr |
‘మిత్రమండలి’ చిత్రానికి రూ.5.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నదే కానీ పోటీగా మరో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.