బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, మన టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన సినిమా ‘జాట్’. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద లాభాలు రాకపోయినా, యాక్షన్ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడటంతో, నిర్మాతలు ఆలస్యం చేయకుండా ‘జాట్ 2’ను అధికారికంగా ప్రకటించేశారు.
అయితే ఈ సీక్వెల్‌కు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చేతిలో పెట్టారట. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీరామ్ ఆదిత్యకు ఇంత పెద్ద బాలీవుడ్ ప్రాజెక్ట్ ఛాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఆయన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లోనే పనిచేస్తుండటంతో, నిర్మాతలు ఆయనపై నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది.
‘జాట్’ సీక్వెల్ మామూలుగా ఉండదట. ఇది ఏకంగా ‘ఎర్త్ వర్సెస్ మార్స్’ కాన్సెప్ట్‌తో, ఫుల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని టాక్. బోయపాటి రేంజ్ మాస్ యాక్షన్‌కు, మార్స్ ఎలిమెంట్స్ జోడిస్తే ఎంత బీభత్సంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
గోపీచంద్ మరో ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నందున, ఆయన అందుబాటులో లేకపోయినా మరో డైరెక్టర్‌తో ముందుకు వెళ్తామని నిర్మాతలు ముందే చెప్పారు. మరి ఇంతటి భారీ సబ్జెక్ట్‌ను శ్రీరామ్ ఆదిత్య ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఈ అనూహ్యమైన కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.