నిజానికి మాస్టర్ ఓడిపోయారా ? కెప్టెన్సీ టాస్క్ లో ఏం జరిగిందంటే..?

  • April 28, 2022 / 12:08 PM IST

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కిల్లర్ టాస్క్ ఫినిష్ అవ్వగానే కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యింది. కిల్లర్ టాస్క్ లో కిల్లర్ గా ఆరు మర్డర్స్ లో ఐదు మర్డర్స్ ని దిగ్విజయంగా చేసిన నటరాజ్ మాస్టర్ తొలి కెప్టెన్సీ పోటీదారులు అయ్యాడు. ఆ తర్వాత మాస్టర్ చేతిలో చనిపోకుండా మిగిలి ఉన్న అషూరెడ్డి, బాబాభాస్కర్, మిత్రాశర్మా, బిందుమాధవి కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. ఈ ఐదుగురికి బ్రిక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బ్రిక్స్ తో ఒక టవర్ ని ఏర్పాటు చేసి, ఆ టవర్ పడిపోకుండా కింద నుంచీ ఒక బ్రిక్ ని తీసి పైన ఒక చేత్తే పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ కి అరియానాని సంచాలక్ గా నియమించారు. ఇక్కడ చాలా పోటాపోటీగా హౌస్ మేట్స్ పార్టిసిపేట్ చేశారు.

ఫస్ట్ అషూరెడ్డి, తర్వాత బిందుమాధవి గేమ్ నుంచీ అవుట్ అయ్యారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ రెండుసార్లు బ్రిక్ ని రెండో చేయి తాకించి పట్టుకున్నాడు. దీంతో అరియానా గేమ్ నుంచీ అవుట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. మాస్టర్ అరియానాని బ్రతిమిలాడుకుంటే వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. అయినా కూడా మాస్టర్ గేమ్ లో నుంచీ అవుట్ అయ్యారు. టవర్ ని సరిగ్గా అంచనా వేయలేక టాస్క్ లో ఓడిపోయారు.

ఇక చివరిలో మిత్రా శర్మా ఇంకా బాబాభాస్కర్ చాలాసేపు నువ్వా నేనా అన్నట్లుగా టాస్క్ లో పోటీపడ్డారు. మిత్రా చాలా సిన్సియర్ గా గేమ్ లో పార్టిసిపేట్ చేసింది. లాస్ట్ వరకూ బాబాభాస్కర్ కి టఫ్ ఫైట్ ఇచ్చింది. ఇక్కడే లాస్ట్ బ్రిక్ తీసేటపుడు బాబాభాస్కర్ బ్రిక్ ని తీసిన తర్వాత దాన్ని రెండో చేత్తో పట్టుకున్నారు. కానీ, సంచాలక్ అరియానా అది నోటీస్ చేయలేదు. యాంకర్ శివ మాస్టర్ రెండో చేయి వస్తోంది చూడండి అంటూ మాస్టర్ కి హింట్ ఇచ్చాడు.

దీంతో మాస్టర్ బ్రిక్ ని టవర్ పైన చాలా జాగ్రత్తగా పెట్టాడు. ఆ తర్వాత వచ్చి మిత్రా మాత్రం టవర్ ని అంచనా వేయలేకపోయింది. బ్రిక్ ని లాగేసరికి టవర్ కూలిపోయింది. గేమ్ నుంచీ అవుట్ అయ్యింది. నిజానికి మాస్టర్ రెండో చేయి పెట్టాడు కాబట్టి మిత్రా కెప్టెన్ అవ్వాల్సింది. కానీ, సంచాలక్ అయిన అరియానా సరిగ్గా గమనించుకోలేదు.

కనీసం బాబాభాస్కర్ మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చి ఉన్నా అక్కడ అఖిల్ అండ్ టీమ్ అబ్జక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మిత్రా జస్ట్ కెప్టెన్సీని మిస్ అయ్యిందనే చెప్పాలి. సంచాలక్ స్ట్రిక్ట్ గా ఉండి ఉంటే మాస్టర్ గేమ్ నుంచీ అవుట్ అయి ఉండేవారే. ఇక ఈవారం లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కాబట్టి మిత్రా హౌస్ లో కెప్టెన్ అవ్వకుండానే ఉండాల్సి ఉంటుంది. అదీ మేటర్.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus